Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న నిబంధనలు.. వాటికి పాన్ అవసర్లేదు…

2026-27 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు అమల్లోకి రానున్నాయి. వీటి గురించి ముందే తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏప్రిల్ నుంచి కొత్తగా పాన్ కార్డు నియమాలు మారనున్నాయి.

Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న నిబంధనలు.. వాటికి పాన్ అవసర్లేదు...
Pan Card

Updated on: Mar 04, 2026 | 12:43 PM

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలుకానుంది. దీంతో దేశ ప్రజలను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆర్ధిక విషయాలను ప్రభావితం చేసే పలు కొత్త నిబంధనలను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌తో పాటు పాన్ కార్డు నియమాల్లో పలు మార్పులు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టంతో పాటు ఇన్ కమ్ ట్యాక్స్ నియమాలు కూడా అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే నియమాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదాలో పలు కీలక విషయాలను పొందుపర్చింది. ఈ ముసాయిదాకు ఆమోదం తెలిపితే కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి నిబంధనలు అమలు చేస్తారు. కొత్త గైడ్ లైన్స్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

రూ.20 లక్షల్లోపు ఆస్తి కొంటే..

ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే రూల్స్ ప్రకారం.. తక్కువ విలువ కలిగిన ఆస్తిని అమ్మినా లేదా కొన్నా కాగితపు పని తక్కువ కానుంది. రూ.20 లక్షల్లోపు విలువ గల ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డు అవసరం లేదు. ఇందుకోసం పాన్ కార్డులు అందించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఇల్లు, ఫ్లాట్ లేదా ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేసినప్పుడు లేదా అమ్మినప్పుడు రూ.10 లక్షలు దాటితే పాన్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.20 లక్షలకు పెంచనున్నారు. దీంతో ఈ పరిమితిలోపు ఆస్తులు కొన్నా, అమ్మినా పాన్ కార్డును అందించాల్సిన అవసరం లేదు. అంతకుముందే జరిపే లావాదేవీలకు మాత్రమే పాన్ అందించాల్సి ఉంటుంది. గిఫ్ట్‌లు, ఆస్తి బదిలీలు వంటివి పరిమితి దాటినే పాన్ రిపోర్టింగ్ నియమాల పరిధిలోకి వస్తాయి.

ఎందుకు పెంచారంటే..?

గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి విలువలు భారీగా పెరుగుతున్నాయి. రూ.10 లక్షల పరిమితి వల్ల చిన్న లావాదేవీలకు కూడా పాన్ అవసరమవుతుంది. పరిమితిని పెంచడం వల్ల భవిష్యత్తులో ప్రస్తుత మార్కెట్ వాస్తవాలను ప్రతిబింబించేలా నియమాలను సర్దుబాటు చేస్తోంది. తక్కువ విలువ గల లావాదేవీలను ఇక నుంచి పూర్తి చేయడం సులభం కావొచ్చు. కుటుంబ ఆస్తి బదిలీలు, చిన్న కొనుగోలుదాలకు కాగితపు పనిని తగ్గించవచ్చు. ఇక రూ.20 లక్షలకు మించిన ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరం. ఇది ఆస్తి కొనుగోళ్లును వ్యక్తి ఆదాయ రికార్డులతో అనుసంధానించడానికి, అధిక విలువ గల రియల్ ఎస్టే్ట్ లావాదేవీలను పర్యవేక్షించడానికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఇది ఉపయోగపడుతుంది. పన్ను ఎగవేతను ట్రాక్ చేయడానకికి, ఆస్తి మార్కెట్‌లో పారదర్శకతను నిర్ధారించడానికి కూడా సహాయపడుతుంది.

Follow Us