BSNL Diwali Offer: కేవలం 1 రూపాయికే రోజుకు 2GB డేటా.. 30 రోజుల చెల్లుబాటు!

BSNL Plan: ఈ బీఎస్‌ఎన్ఎల్‌ ఆఫర్ ప్రత్యేకంగా కొత్త కస్టమర్లకు దాని స్వదేశీ 4G నెట్‌వర్క్ రుచిని అందించడానికి రూపొందించారు. ఎటువంటి సర్వీస్ ఛార్జ్ ఉండదు. అంటే వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పూర్తి 30 రోజుల పాటు నెట్‌వర్క్ వేగం..

BSNL Diwali Offer: కేవలం 1 రూపాయికే రోజుకు 2GB డేటా.. 30 రోజుల చెల్లుబాటు!

Updated on: Oct 21, 2025 | 8:33 PM

దీపావళి సందర్భంగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కొత్త కస్టమర్లకు అద్భుతమైన బహుమతిని ప్రవేశపెట్టింది. కంపెనీ అక్టోబర్ 15 నుండి నవంబర్ 15, 2025 వరకు అమలులో ఉన్న ప్రత్యేక BSNL దీపావళి ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద వినియోగదారులకు కేవలం రూ.1కే 4G ఇంటర్నెట్, పూర్తి నెల కాల్స్ అందిస్తుంది.

ఎటువంటి సర్వీస్ ఛార్జీ లేకుండా కొత్త 4G నెట్‌వర్క్:

ఈ బీఎస్‌ఎన్ఎల్‌ ఆఫర్ ప్రత్యేకంగా కొత్త కస్టమర్లకు దాని స్వదేశీ 4G నెట్‌వర్క్ రుచిని అందించడానికి రూపొందించారు. ఎటువంటి సర్వీస్ ఛార్జ్ ఉండదు. అంటే వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పూర్తి 30 రోజుల పాటు నెట్‌వర్క్ వేగం, నాణ్యతను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్‌ పూర్తి 4G సేవలను రుచి చూపించడానికి రూపొందించారు. ఈ ఆఫర్‌లో భారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ 4G డేటా, రోజుకు 100 SMSలు, ఉచిత సిమ్ కార్డ్ ఉన్నాయి.

ఈ ఆఫర్‌ను ఎలా పొందాలి?

  • కొత్త వినియోగదారులు ఈ ఆఫర్‌ను రెండు విధాలుగా పొందవచ్చు:
  • మీకు సమీపంలోని BSNL స్టోర్‌లో రిజిస్టర్ చేసుకోండి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఉపయోగించి మీ ఇంటి నుండే సిమ్ కార్డ్ ఆర్డర్ చేయండి.
  • ఈ ఆఫర్ అక్టోబర్ 15 నుండి నవంబర్ 15, 2025 వరకు మాత్రమే చెల్లుతుంది.
  • ఈ పండుగ సీజన్‌లో మరిన్ని మంది కస్టమర్లను జోడించడం, దాని భారతీయ 4G నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడం బీఎస్‌ఎన్‌ఎల్‌ లక్ష్యం.

ఎయిర్‌టెల్ 84 రోజుల ప్లాన్

ఎయిర్‌టెల్ గురించి చెప్పాలంటే, కంపెనీ వినియోగదారులకు 84 రోజుల చెల్లుబాటుతో రూ. 979 ప్లాన్‌ను అందిస్తుంది. ఇది మొత్తం 168GB డేటా (రోజువారీ 2GB), ఉచిత అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాప్ ద్వారా 22 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

 

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌లో 5 చౌకైన రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ధరల్లో ఎక్కువ వ్యాలిడిటీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి