BSNL: బీఎస్ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్ వచ్చేసింది.. ఎవరైనా కొనుగోలు చేయొచ్చు.. ధర ఎంతంటే..?

బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. సాధారణ వినియోగదారులు కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. దీని ధరను కూడా ఫిక్స్ చేశారు. కానీ ఈ ఫోన్ వాడాలంటే కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ నుంచి అనుమతి తీసకోవాల్సి ఉంటుంది.

BSNL: బీఎస్ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్ వచ్చేసింది.. ఎవరైనా కొనుగోలు చేయొచ్చు.. ధర ఎంతంటే..?
Bsnl

Updated on: Jul 09, 2026 | 8:22 PM

మొబైల్ వినియోగదారులకు బీఎస్ఎన్‌ఎల్ గుడ్ న్యూస్ తెలిపింది. శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సిగ్నల్స్, మొబైల్ టవర్లు లేని ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ శాటిలైట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 1,34,166గా ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ సాంప్రదాయ సెల్యులార్ నెట్‌వర్క్‌లకు బదులుగా ఉపగ్రహాలను ఉపయోగించి పనిచేసేలా అభివృద్ది చేశారు. దీంతో మొబైల్ కనెక్టివిటీ అందుబాటులో లేని మారుమూల గ్రామాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ శాటిలైట్ మొబైల్ ఫోన్‌ను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. కానీ కొనుగోలు ప్రక్రియ అనేది చాలా కఠినతరంగా ఉంటుంది. దేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కఠినతరమైన నియంత్రణ ఉంది.

శాటిలైట్ ఫోన్ ఎలా పనిచేస్తుంది..?

వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి లేదా ఉపయోగించడానికి ముందు టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డాట్ నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే ఈ ఫోన్ కొనుగోలు చేసి ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ శాటిలైట్ ఫోన్ నేరుగా ఉపగ్రహాలకు అనుసంధానించబడి ఉంటుంది. దీనివల్ల మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా వినియోగదారులు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితులలో లేదా సాంప్రదాయ టెలికాం మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్త ఉపగ్రహ నెట్‌వర్క్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో ఈ హ్యాండ్‌సెట్‌ను అభివృద్ధి చేసినట్లు బీఎస్ఎన్‌ఎల్ చెబుతోంది. ఇది మారుమూల ప్రాంతాలలో ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్‌ను సాధ్యం చేస్తుందని కంపెనీ చెబుతోంది.

BSNL శాటిలైట్ ఫోన్ ఫీచర్లు ఇవే..

-మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ లేని ప్రాంతాలకు శాటిలైట్ కనెక్టివిటీ అందుతుంది

-సుదూర ప్రాంతాల నుండి వాయిస్ కాలింగ్ చేయవచ్చు

-ఎమర్జెన్సీ పరిస్థితుకల్లో SOS అత్యవసర సహాయం పొందవచ్చు

-ఛార్జింగ్ సౌకర్యాలకు దూరంగా ఎక్కువసేపు ఉపయోగించడానికి వీలుగా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటుంది

-విపత్కర వాతావరణ పరిస్థితుల్లో కూడా వర్క్ అవుతుంది

– దృఢమైన, మన్నికైన డిజైన్ కలిగి ఉంటుంది

-రక్షణ, సముద్ర కార్యకలాపాలు, విపత్తు ప్రతిస్పందన, మైనింగ్, మారుమూల పారిశ్రామిక కార్యకలాపాలు, ఏకాంత ప్రాంతాల గుండా ప్రయాణించే యాత్రికులు, సాహస యాత్రలలో పనిచేసేవారికి ఇది ఉపయోగపడుతుంది

– మరిన్ని వివరాలకు సమీపంలోని BSNL కార్యాలయాన్ని  లేదా 9768866652 నంబర్‌లో ఆపరేటర్‌ను సంప్రదించాలని బీఎస్‌ఎన్ఎల్ కోరింది

Follow Us