BSNL: త్వరపడండి.. 1 రూపాయికే రోజూ 2 డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. ఈ ఒక్క రోజే ఛాన్స్‌!

BSNL Plan: భారతీయ టెలికా సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్లను అందిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్లాన్స్‌తో ముందుకొస్తుంది. ఇప్పుడు మరో ప్లాన్‌ అందుబాటులో ఉంది. కేవలం ఒక రూపాయికే ప్రతి రోజు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌ ఈ రోజుతో ముగియనుంది. ఈ ఒక్క రోజే అవకాశం ఉంది..

BSNL: త్వరపడండి.. 1 రూపాయికే రోజూ 2 డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. ఈ ఒక్క రోజే ఛాన్స్‌!

Updated on: Aug 31, 2025 | 7:17 AM

BSNL Recharge Plans: ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. గతంలో ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌, వీలు రీఛార్జ్‌ ధరలు పెంచినా బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఎలాంటి ధరలు పెంచలేదు. దీంతో అప్పటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆదరణ లభిస్తోంది. లక్షలాది మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ కూడా తక్కువ ధరల్లోనే రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఇటీవల ఎయిర్‌టెల్, జియో వంటి సంస్థలు 28 రోజుల వ్యాలిడిటీతో రోజు 1 GB డేటా అందించే ప్లాన్‌ను సైతం నిలిపివేశాయి. అయితే ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఇటీవల ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇది కూడా చదవండి: Viral Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. కొండముచ్చు ముందు అమ్మాయి రీల్స్‌.. చివరకు ఏమైందంటే..

ఈ ప్లాన్ కింద కేవలం ఒక రూపాయికే ఉచితంగా సిమ్ అందిస్తోంది. ఇంకా అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లు, సహా రోజుకు 2GB డేటా అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు.ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుందని ముందే ప్రకటించింది. అంటే ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ. 1 తో సిమ్ తీసుకుంటే .. సెప్టెంబర్ 30 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. సెప్టెంబర్ 1 నుంచి మాత్రం ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని గుర్తుంచుకోవాలి. యధావిధిగా ప్లాన్‌ వేయించుకోవాల్సిందే.

ఇది కూడా చదవండి: DMart vs Reliance Retail: డిమార్ట్ vs రిలయన్స్ రిటైల్.. చౌకైన షాపింగ్‌ కోసం ఏది బెస్ట్‌?

ఓటీటీ కంటెంట్‌, టీవీ ఛానెల్స్‌:

ఇదిలా ఉండగా, మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌ OTT కంటెంట్, టీవీ ఛానెళ్లను అందిస్తోంది. ఇటీవల BITV లాంచ్ చేసింది. దీని ప్రీమియం ప్యాక్ ను తాజాగా ప్రకటించింది. ఇక్కడ రూ. 151 తోనే.. 25 కు పైగా OTT, 450 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి