Central Government: డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ పొందాలంటే కష్టమే.. అక్టోబర్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్.. అమల్లోకి కఠిన మార్పులు..

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా.. అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈ సర్టిఫికేట్ల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. ఇక నుంచి ఈ సర్టిఫికేట్లను పొందేందుకు క్లిష్టతరమైన ప్రక్రియ ఉండనుంది.

Central Government: డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ పొందాలంటే కష్టమే.. అక్టోబర్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్.. అమల్లోకి కఠిన మార్పులు..
Date Pf Birth

Updated on: Sep 26, 2026 | 9:44 PM

కేంద్ర ప్రభుత్వం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డెట్ సర్టిఫికేట్ల జారీలో కీలక మార్పులు చేసింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్మెంట్) యాక్ట్, 2026 పేరుతో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. 2026 అక్టోబర్ 1 నుండి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇక నుంచి జననం లేదా మరణం జరిగిన తేదీ నుండి 21 రోజుల్లోగా నమోదు చేసుకోవాలి. 21 రోజుల్లోగా నమోదు చేసుకుంటే ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఒక సంవత్సరం నుండి రెండేళ్ల లోపు నమోదు చేసుకుంటే ప్రక్రియ కొంత కఠినంగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ద్వారా అధికారం పొందిన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి అవుతుంది. సంబంధిత అధికారులు దరఖాస్తులోని వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. అధికారులు నిజమో కాదో ధ్రువీకరిస్తారు. అనంతరం నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండేళ్లు దాటిన తీర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అత్యంత ఆలస్య నమోదుగా పరిగణిస్తారు. ఈ కేటగిరీ దరఖాస్తులకు అత్యంత కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి.

రెండేళ్లు దాటిన తర్వాత నమోదు చేసుకునే కేసుల్లో జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ నుండి ఆదేశం తప్పనిసరి అవుతుంది. JMFC ఆదేశం అందిన తర్వాత మాత్రమే ఆలస్య రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాలం క్రితం జరిగిన సంఘటనలను నమోదు చేయడంలో జవాబుదారీతనాన్ని, ప్రామాణికతను పెంచడానికి ఈ రూల్స్ ఉపయోగపడనున్నాాయి. పౌరులు జనన, మరణాలను సకాలంలో నమోదు చేయడాన్ని ప్రోత్సహించడం, చాలా సంవత్సరాల తర్వాత వచ్చే దరఖాస్తుల్లో మరింత క్షుణ్ణమైన పరిశీలన ఉండేలా చూడడం కోసం కేంద్రం ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.  గతంలో నమోదు కాని జనన లేదా మరణ సంఘటనలను చాలా ఆలస్యంగా రిజిస్టర్ చేయాలనుకునే కేసులకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

మీ కుటుంబంలో ఎవరిదైనా జననం లేదా మరణం ఇప్పటివరకు అధికారికంగా నమోదు కాకపోతే.. ఆలస్యం చేయకుండా మీ స్థానిక జనన, మరణ రిజిస్ట్రార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం లేదా సంబంధిత ప్రభుత్వ అధికారిని సంప్రదించండి. అనంతరం అవసరమైన వివరాలు తెలుసుకుని తగిన ప్రక్రియను పూర్తి చేయండి. సకాలంలో నమోదు చేయని పక్షంలో భవిష్యత్తులో విద్య, ఉద్యోగం, వారసత్వం, ఇతర ప్రభుత్వ సేవలను పొందడంలో అవాంతరాలు ఏర్పడవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us