Bank Holidays: రెండ్రోజుల పాటు బంద్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఏయే రోజుల్లో అంటే..

కొత్త వారం వస్తుందంటేనే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మీ ఆర్ధిక వ్యవహారాలను ప్రభావితం చేసే నిర్ణయాలు కూడా అందులో ఉండవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. బ్యాంక్ సెలవుల విషయానికొస్తే.. వచ్చే వారం మూతపడనున్నాయి. ఏయే రోజుల్లో అనేది ఇప్పుడు చూద్దాం.

Bank Holidays: రెండ్రోజుల పాటు బంద్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఏయే రోజుల్లో అంటే..
Bank Holidays

Updated on: Sep 19, 2026 | 1:23 PM

బ్యాంక్ సెలవులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొత్త వారం వచ్చిందంటే.. బ్యాంక్ హాలీడేస్‌లో కూడా మార్పులు ఉంటాయి. రెండు, నాలుగో శనివారంతో పాటు జాతీయ సెలవులు, రాష్ట్రాల అధికారిక సెలవులు దినాలు, ప్రాంతీయ సెలవుల్లో బ్యాంకులు మూతడతాయి. మీరు బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాలని అనుకుంటున్నా లేదా బ్యాంక్ లావాదేవీలతో అవసరం ఉన్నా సెలవుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారం సెప్టెంబర్ 21 నుంచి 27 మధ్య బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం వచ్చేవారంలో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకుందాం.

వచ్చే వారం బ్యాంకు సెలవులు ఇవే..

-సెప్టెంబర్ 21న సోమావారం శ్రీమంత శంకరదేవ,శ్రీ నారాయణ గురు సమాధి జన్మోత్సవం సందర్భంగా గౌహతి, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులు మూతపడనున్నాయి

– సెప్టెంబర్ 22న మంగళవారం కర్మ పూజ సందర్భంగా రాంచీలో బ్యాంకులు ఉండవు

-సెప్టెంబర్ 23న మహారాజా హరి సింగ్ జీ జన్మదినం సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్ కానున్నాయి

సెప్టెంబర్ 25న శుక్రవారం ఇంద్రజాతర సందర్భంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి

-సెప్టెంబర్ 26న రెండో నాల్గో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవ్

-సెప్టెంబర్ 27న ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవ్

-దేశవ్యాప్తంగా మొత్తం రెండు రోజుల పాటు బ్యాంకులు ఉండవు.

ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయా..?

బ్యాంక్ సెలవులు ప్రాంతం, రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. దీంతో మీరు బ్రాంచ్‌ని సందర్శించేముందు ఒకసారి సిబ్బందిని అడిగి సమచారం తెలుసుకోవడం మంచిది. సంబంధిత శాఖను సంప్రదించి నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతనే బ్యాంకు కార్యకలాపాలు ప్లాన్ చేసుకోవాలి. అయితే సెలవు రోజుల్లో ఆన్ లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. దీంతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. యూపీఐ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఏటీఎం ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు. కేవలం బ్రాంచ్ సంబంధిత కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి. చెక్కుల క్లియరెన్స్, బ్యాంక్ బ్రాంచ్‌ని సంప్రదించి చేసే లావాదేవీలు అందుబాటులో ఉండవు. దీంతో బ్యాంకు బ్రాంచ్‌లతో పని ఉంటే ముందుగా ప్లాన్ చేసుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us