బజాజ్ న్యూ సిటీ 110 బైక్..

| Edited By:

Jul 23, 2019 | 11:44 AM

కొత్త బైక్ కొనుక్కోవాలి అనుకునే వారికి ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో గుడ్ న్యూస్ చెబుతోంది. తాజాగా సిటీ 110 అనే కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ. 37, 997 నుంచి ప్రారంభం అవుతుంది. బజాజ్ సీటీ110 బైక్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్ అనేవి రెండు వేరియంట్లు. కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.37,997గా, ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర […]

బజాజ్ న్యూ సిటీ 110 బైక్..
Follow us on

కొత్త బైక్ కొనుక్కోవాలి అనుకునే వారికి ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో గుడ్ న్యూస్ చెబుతోంది. తాజాగా సిటీ 110 అనే కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ. 37, 997 నుంచి ప్రారంభం అవుతుంది. బజాజ్ సీటీ110 బైక్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్ అనేవి రెండు వేరియంట్లు. కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.37,997గా, ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.44,480గా ఉంది. ఇక బైక్ లుక్ విషయానికి వస్తే.. ఇది రెడ్, బ్లూ రంగులలో ఉంటుంది. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలో ఈ బైక్‌ను డిజైన్ చేసినట్లు బజాజ్ ఆటో మోటార్‌ సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. అలాగే టెక్నాలజీ, స్టైల్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. బైక్‌లో సెమీ నాబీ టైర్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బిగ్గర్ క్రాష్ గార్డ్, అప్‌స్వెప్ట్ ఎక్స్‌హాస్ట్, రబ్బర్ మిర్రర్ కవర్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇందులో 115 సీసీ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు.