
ఏటీఎం కార్డు ఇరుక్కుపోవడానికి కేవలం సాంకేతిక లోపాలే కాదు, భద్రతా కారణాలు కూడా ఉండవచ్చు. మీరు ఎక్కువ సమయం తీసుకోవడం లేదా వరుసగా తప్పు పిన్ నంబర్ నమోదు చేయడం వంటివి చేసినప్పుడు మెషీన్ ఆటోమేటిక్‌గా కార్డును హోల్డ్ చేస్తుంది. మరి ఇలాంటప్పుడు కార్డును ఎలా బ్లాక్ చేయాలి? కొత్త కార్డు కోసం ఎలా అభ్యర్థించాలి? అసలు ఇరుక్కుపోయిన పాత కార్డును తిరిగి పొందే మార్గం ఉందా? వంటి పూర్తి వివరాలు
1. భయాందోళన వద్దు – మెషీన్‌ను గమనించండి :
కార్డు రాకపోతే వెంటనే కంగారు పడి మెషీన్‌ను లాగడం లేదా కొట్టడం చేయకండి. ముందుగా ఏటీఎం మెషీన్ పైన ఉండే ATM ID నంబర్, బ్యాంక్ పేరు, స్థానం, సమయాన్ని ఒక దగ్గర రాసుకోండి లేదా ఫోటో తీసుకోండి.
2. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు :
వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయండి. జరిగిన విషయాన్ని వివరించి, మీ కార్డును వెంటనే ‘హాట్‌లిస్ట్’ (Hotlist) లేదా బ్లాక్ చేయమని కోరండి. దీనివల్ల ఆ కార్డు ద్వారా ఎవరూ ఒక్క రూపాయి కూడా తీయలేరు.
3. కార్డును రద్దు చేయడం :
మీ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అనుమానం ఉంటే, కార్డును శాశ్వతంగా రద్దు చేయడమే ఉత్తమం. మీరు కాల్ ద్వారా లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కొత్త కార్డు కోసం అభ్యర్థించవచ్చు. 7 నుండి 10 పని దినాల్లో కొత్త కార్డు మీ ఇంటికి వస్తుంది.
4. పాత కార్డును తిరిగి పొందడం:
ఒకవేళ మీరు కార్డును రద్దు చేయకూడదనుకుంటే, అది మీ సొంత బ్యాంక్ ఏటీఎం అయితే బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయండి. ఏటీఎం మెయింటెనెన్స్ టీమ్ కార్డును తీసి మీ హోమ్ బ్రాంచ్‌కు అప్పగిస్తారు. మీరు మీ ఆధార్ లేదా పాన్ కార్డ్ చూపించి దానిని తిరిగి తీసుకోవచ్చు.
5. ఎందుకు ఇరుక్కుపోతుంది?
సాంకేతిక లోపాలు: నెట్‌వర్క్ సమస్య లేదా పవర్ కట్ అయినప్పుడు.
సెక్యూరిటీ లాక్: పిన్ నంబర్ పదే పదే తప్పుగా కొట్టినప్పుడు లేదా ట్రాన్సాక్షన్ మధ్యలో ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు భద్రత కోసం మెషీన్ కార్డును లాక్ చేస్తుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏటీఎం కార్డు ఇరుక్కుపోయినప్పుడు ఆ పరిసరాల్లో ఉండే అపరిచితుల సాయం తీసుకోకండి. కేవలం బ్యాంక్ అధికారిక నంబర్లకు మాత్రమే కాల్ చేయండి.