House Construction: రెండు రూమ్‌ల రేకుల ఇల్లు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

House Construction: AAC (ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్) బ్లాక్స్‌తో నిర్మాణం ఒక మంచి ఎంపిక. ఈ బ్లాక్స్ వాటి తక్కువ బరువు, వేగవంతమైన నిర్మాణం, బడ్జెట్‌కు అనుకూలమైన లక్షణాల వల్ల ప్రాచుర్యం పొందాయి. 2026లో ఇటువంటి నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చుల వివరాల గురించి..

House Construction: రెండు రూమ్‌ల రేకుల ఇల్లు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
Aac Block 2 Room

Updated on: Sep 26, 2026 | 1:48 PM

House Construction:  మొదటి అంతస్తులో, ఇప్పటికే ఉన్న స్లాబ్ పైన రెండు రూముల రేకుల ఇల్లు నిర్మించాలనుకునే వారికి, AAC (ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్) బ్లాక్స్‌తో నిర్మాణం ఒక మంచి ఎంపిక. ఈ బ్లాక్స్ వాటి తక్కువ బరువు, వేగవంతమైన నిర్మాణం, బడ్జెట్‌కు అనుకూలమైన లక్షణాల వల్ల ప్రాచుర్యం పొందాయి. 2026లో ఇటువంటి నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చుల వివరాల గురించి తెలుసుకుందాం. అయితే నిర్మించే రెండు గదుల విస్తీర్ణం మొత్తం 12 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ రూములకు రెండు అటాచ్డ్ బాత్రూమ్‌లు కూడా ఉంటాయి. స్లాబ్ పైన బరువు తగ్గించడానికి, ఇక్కడ 6 అంగుళాల వెడల్పు గల AAC బ్లాక్స్‌ను ఉపయోగించవచ్చు.

1. AAC బ్లాక్స్: రెండు రూముల నిర్మాణానికి సుమారు 550 AAC బ్లాక్స్ అవసరం. ఒక్కో బ్లాక్ ధర సుమారుగా రూ.62 చొప్పున, మొత్తం ఖర్చు రూ.34,100.

2. కెమికల్ (AAC బ్లాక్స్ కట్టడానికి): AAC బ్లాక్స్ కట్టడానికి ప్రత్యేక కెమికల్ ఉపయోగించాలి. దాదాపు 10 బ్యాగులు అవసరం, ఒక్కో బ్యాగ్ ధర రూ.600 చొప్పున, మొత్తం రూ.6,000.

ఇవి కూడా చదవండి

3. సిమెంట్: ప్లాస్టరింగ్, ఇతర పనుల కోసం దాదాపు 20 బ్యాగుల సిమెంట్ అవసరం. ఒక్కో బ్యాగ్ ధర సుమారుగా రూ.320 చొప్పున, మొత్తం రూ.6,400.

4. ఇసుక (సాండ్): ప్లాస్టరింగ్ మొదలైన వాటికి రెండు యూనిట్ల ఇసుక అవసరం. ఒక్కో యూనిట్ ధర రూ.4,500 చొప్పున, మొత్తం రూ.9,000.

5. పైకప్పు (రేకులు): ఈ నిర్మాణానికి ఐరన్ పైపులు, ఐరన్ రేకులతో పైకప్పు ఏర్పాటు చేస్తారు. ముందు వైపు 3 అడుగులు అదనంగా ఉండేలా 15 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పుతో, మొత్తం 420 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. చదరపు అడుగుకు రూ.100 చొప్పున మొత్తం రూ.42,000. (సిమెంట్ రేకులు వాడితే రూ.28,000 – రూ.30,000 మధ్య ఖర్చవుతుంది).

6. తలుపులు (దర్వాజాలు): రెండు రూములకు అవసరమైన తలుపులు, వాటి ఫిట్టింగ్‌లకు సుమారు రూ.20,000.

7. కిటికీలు (విండోస్): రెండు uPVC కిటికీలు వాటి సేఫ్టీ గ్రిల్స్‌తో కలిపి సుమారు రూ.15,000. చెక్క కిటికీలు ఎంచుకుంటే బడ్జెట్ పెరుగుతుంది.

8. ఎలక్ట్రికల్ వర్క్: స్విచ్ బోర్డులు, లైట్లు, కన్సీల్డ్ వైరింగ్ మొదలైన ఎలక్ట్రికల్ పనులకు సుమారు రూ.45,000 (రూ.40,000 నుండి రూ.50,000 మధ్య).

9. ఫాల్స్ సీలింగ్: రెండు రూముల్లో ప్లేన్ ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేయడానికి చదరపు అడుగుకు రూ.42-రూ.45 చొప్పున, మొత్తం రూ.14,112.

10. టైల్స్ వర్క్: ఫ్లోరింగ్ కోసం టైల్స్ కొనుగోలుకు సుమారు రూ.14,112, టైల్స్ వేసే కూలీ ఖర్చు సుమారు రూ.7,392, టైల్స్ వర్క్ మొత్తం ఖర్చు రూ.21,504.

11. పెయింటింగ్ వర్క్: వాల్ కేర్లు, పెయింటింగ్ పనులకు సుమారు రూ.45,000.

12. మేస్త్రీ/కూలీ ఖర్చులు: రోజువారీ కూలీల పద్ధతిలో పని చేయిస్తే, ప్లాస్టరింగ్, కట్టుబడి వంటి పనులకు సుమారు రూ.40,000 (రూ.30,000 నుండి రూ.40,000 మధ్య). కాంట్రాక్టుకు ఇస్తే రూ.50,000 నుండి రూ.80,000 వరకు అవుతుంది.

13. ప్లంబింగ్ వర్క్: రెండు అటాచ్డ్ బాత్రూమ్‌లలో ప్లంబింగ్, వాటర్ ట్యాంక్, టైల్స్, సీట్స్ మొదలైన వాటికి సుమారు రూ.30,000.

మొత్తం అంచనా వ్యయం:

పైన పేర్కొన్న అన్ని ఖర్చులను కలిపి చూస్తే, మొదటి అంతస్తులో AAC బ్లాక్స్‌తో రెండు రూముల రేకుల ఇల్లు నిర్మించడానికి అయ్యే మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.3,33,116. అయితే ఈ విరాలన్ని బిల్డర్స్‌, మేస్త్రీలు అందించిన సమాచారం ప్రకారం అందిస్తున్నాము. ఈ అంచనా మార్కెట్ ధరలు, ప్రాంతం, మెటీరియల్ ఎంపికల ఆధారంగా మారవచ్చు. బడ్జెట్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, సుమారుగా ఎంత బడ్జెట్‌ అవుతుందో అంచనా వేసుకునేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి.

ఇది కూడా చదవండి: Bank Strike: బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట.. ATM ఛార్జీలు రద్దు..!

ఇది కూడా చదవండి: Banks Strike: బ్యాంక్ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us