Business Ideas: ఉద్యోగం పోయిందా? నో టెన్షన్‌.. ఎప్పటికీ డిమాండ్‌ ఉండే 8 వ్యాపారాలు!

Business Ideas: ప్రపంచం మారుతున్నా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొన్ని మౌలిక అవసరాలు మాత్రం ఎప్పటికీ మారవు. ఆహారం, దుస్తులు, ఆరోగ్యం, విద్య వంటివి ఏ AI వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా, లాక్‌డౌన్‌లు వచ్చినా ప్రజలకు తప్పనిసరి. సరిగ్గా ఇలాంటి అవసరాల..

Business Ideas: ఉద్యోగం పోయిందా? నో టెన్షన్‌.. ఎప్పటికీ డిమాండ్‌ ఉండే 8 వ్యాపారాలు!
Business Ideas

Updated on: Nov 10, 2026 | 11:47 AM

Business Ideas: ఒకప్పుడు ఉద్యోగం అంటే జీవితం స్థిరపడిపోయినట్లే. కానీ నేటి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం ఉద్యోగాలపై పడుతోంది, ద్రవ్యోల్బణం పెరుగుతున్నా జీతాలు మాత్రం పెరగడం లేదు. ఇలాంటి తరుణంలో కేవలం ఒకే ఒక ఆదాయ వనరుపై ఆధారపడటం అత్యంత ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రేపు ఏం జరుగుతుందో మనం నియంత్రించలేకపోవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా డిమాండ్ ఉండే పనులను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం.

ప్రపంచం మారుతున్నా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొన్ని మౌలిక అవసరాలు మాత్రం ఎప్పటికీ మారవు. ఆహారం, దుస్తులు, ఆరోగ్యం, విద్య వంటివి ఏ AI వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా, లాక్‌డౌన్‌లు వచ్చినా ప్రజలకు తప్పనిసరి. సరిగ్గా ఇలాంటి అవసరాల చుట్టూనే సక్సెస్ అయ్యే వ్యాపారాలను నిర్మించుకోవాలి. అయితే చాలా మంది వ్యాపారాన్ని కూడా ఒక ఉద్యోగం లాగే భావిస్తుంటారు. దీన్ని నివారించడానికి ట్రిప్ టెస్ట్ అనే ఒక పరీక్షను పరిగణనలోకి తీసుకోవాలి.

ట్రిప్ టెస్ట్ అంటే ఏమిటి?

మీకు ఒక వ్యాపారం ఉందనుకుందాం. మీరు రెండు వారాల పాటు పని చేయకుండా వెకేషన్‌కు వెళ్లారు. మీ ఫోన్, ల్యాప్‌టాప్ స్విచ్ఛాఫ్ చేసి, ఎవరికీ తెలియకుండా విశ్రాంతి తీసుకున్నారు. రెండు వారాల తర్వాత తిరిగి వచ్చి మీ బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసినప్పుడు, మీకు డబ్బు వచ్చి ఉంటే అది నిజమైన వ్యాపారం. ఒకవేళ రాకపోతే, అది కేవలం మీరు స్వయంగా సృష్టించుకున్న ఒక ఉద్యోగం మాత్రమే. ఒక మొబైల్ రిపేర్ మెకానిక్ లేదా ట్యూషన్ టీచర్ రెండు వారాలు పని చేయకపోతే వారి ఆదాయం ఆగిపోతుంది. అంటే వారు ఒక సిస్టమ్‌ను నిర్మించకుండా, తమకు తామే ఒక ఉద్యోగాన్ని సృష్టించుకున్నారు. నిజమైన వ్యాపారం అంటే మీరు ఉన్నా లేకపోయినా ఒక పక్కా సిస్టమ్ పనిచేస్తూ, మీకు నిరంతరం ఆదాయాన్ని అందిస్తూ ఉండాలి. ఈ టెస్ట్‌ను పాస్ చేసే 8 వ్యాపార ఆలోచనలను ఇప్పుడు చూద్దాం.

ఎప్పటికీ డిమాండ్ ఉండే 8 వ్యాపార ఐడియాలు:

1. క్లౌడ్ కిచెన్‌లు (Cloud Kitchens):

సాధారణ టిఫిన్ సర్వీస్ లా కాకుండా, క్లౌడ్ కిచెన్‌లు సిస్టమ్ ఆధారితమైనవి. మీరు వంట చేయరు, మీ చెఫ్ చేస్తారు. డెలివరీ భాగస్వాములు ఆహారాన్ని వినియోగదారులకు చేరవేస్తారు. ఒకే కిచెన్ సెటప్‌తో స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫామ్‌లలో బహుళ బ్రాండ్‌లను నడపవచ్చు (ఉదాహరణకు, బిర్యానీ, మోమోస్, సలాడ్‌లు). మూడు నుండి ఐదు లక్షల పెట్టుబడితో చిన్న కిచెన్, ఇద్దరు చెఫ్‌లు, ప్యాకేజింగ్ సామగ్రితో దీన్ని ప్రారంభించవచ్చు. రెబెల్ ఫుడ్స్ (ఫాసోస్, బెహ్రూజ్ బిర్యానీ) వంటి కంపెనీలు ఈ మోడల్‌తో వేల కోట్ల విలువైన సంస్థలుగా ఎదిగాయి.

2. ఏసీ సర్వీస్ అండ్ ఏఎంసీ బిజినెస్ (AC Service):

ప్రతి ఇల్లు, ఆఫీస్, షాప్, హాస్పిటల్స్‌లో ఏసీలు సర్వసాధారణం. ఏసీల అమ్మకాలు పెరుగుతున్న కొద్దీ వాటి నిర్వహణ, సర్వీసింగ్ అవసరం కూడా పెరుగుతుంది. ఒక ఏసీకి సంవత్సరానికి కనీసం రెండుసార్లు సర్వీసింగ్ అవసరం. కేవలం రిపేర్లు కాకుండా, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులు (AMC) తీసుకోవడం ద్వారా నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు. ఒక 200 మంది AMC కస్టమర్ల నుండి సంవత్సరానికి సుమారు రూ.8 లక్షలు సంపాదించవచ్చు. చిన్న షాప్, ఇద్దరు ముగ్గురు టెక్నీషియన్లు, బేసిక్ టూల్ కిట్‌తో దీన్ని ప్రారంభించవచ్చు.

3. లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ చైన్ (Laundry, Dry Cleaning Chain):

ఈ “బోరింగ్” వ్యాపారంలో 40-50% వరకు లాభాలు ఉంటాయి. ఇది మానవులపై ఆధారపడేది కాదు, మెషిన్ డ్రివెన్ బిజినెస్. వాషింగ్ మెషిన్‌లు, డ్రైయర్‌లు, ఐరన్‌లు పనిచేస్తాయి. మీరు కేవలం సిస్టమ్‌ను సరిగ్గా నిర్వహించాలి. యూక్లీన్ (UClean) వంటి కంపెనీలు ఫ్రాంచైజ్ మోడల్‌లో 200కు పైగా ఔట్‌లెట్‌లతో సక్సెస్ అయ్యాయి. బట్టలు ఉతకడం అనేది ఎప్పటికీ ఆగని అవసరం కాబట్టి, ఇది రెసెషన్ ప్రూఫ్ వ్యాపారం.

4. కోచింగ్ టు కోర్సెస్ (Coaching to Courses):

ట్యూషన్ లాంటి వ్యక్తిగత కోచింగ్ కాకుండా, ఆన్‌లైన్ కోర్సుల రూపంలో విద్యను అందించడం ఒక సిస్టమ్ ఆధారిత వ్యాపారం. ఒక్కసారి రికార్డ్ చేసిన కోర్సు నిరంతరం అమ్ముడవుతూ ఉంటుంది. అలక్ పాండే (ఫిజిక్స్ వాలా) చిన్న వీడియోలతో యూట్యూబ్‌లో మొదలుపెట్టి బిలియన్ డాలర్ల కంపెనీని నిర్మించారు. మీకు ఇంగ్లీష్, ఎక్సెల్, కుకింగ్, మ్యాథ్స్, ఫిట్‌నెస్ వంటి ఏ అంశంలో నైపుణ్యం ఉన్నా దానిపై కోర్సు సృష్టించి ఉడెమీ, స్కిల్‌షేర్ లేదా మీ సొంత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. మొదట్లో తక్కువ పెట్టుబడితో (మైక్రోఫోన్, స్క్రీన్ రికార్డింగ్) ప్రారంభించవచ్చు.

5. రెంటల్ బిజినెస్ (Rental Business):

వస్తువులను కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చు. జేసీబీ మెషీన్‌లు, అడ్వాన్స్‌డ్ కెమెరాలు (వెడ్డింగ్ షూట్‌ల కోసం), పెళ్లిళ్ల డెకరేషన్ వస్తువులు, బైక్‌లు, స్కూటర్లు (టూరిస్ట్ ప్రాంతాల్లో) వంటివి అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఈ వ్యాపారంలో మీరు స్వయంగా కష్టపడాల్సిన అవసరం తక్కువ, ఆస్తులు మీ కోసం పని చేస్తాయి. తక్కువ పెట్టుబడితో డ్రోన్ వంటి వస్తువులతో ప్రారంభించి, తక్కువ సమయంలోనే పెట్టుబడిని తిరిగి పొందవచ్చు.

6. సెలూన్ చైన్ (Salon Chain):

జనాలకు జుట్టు పెరుగుదల ఎప్పుడూ ఆగదు, మేకప్ అవసరం కూడా ఉంటుంది. జావేద్ హబీబ్ (900+ సెలూన్‌లు), నాచురల్స్ సెలూన్ (700+ బ్రాంచెస్‌) వంటి వారు కేవలం జుట్టు కత్తిరించడం ద్వారా ధనవంతులు కాలేదు. వారు ఒక హెయిర్ కటింగ్ సిస్టమ్‌ను నిర్మించడం ద్వారా కోటీశ్వరులు అయ్యారు. మంచి సెలూన్‌ను ప్రారంభించి, స్టాఫ్‌ను నియమించి, మంచి సర్వీస్‌ అందించడం ద్వారా ఒక బ్రాంచ్ నెలకు రూ.30,000-40,000 లాభం తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత బ్రాంచ్‌లను పెంచుకుంటూ ఫ్రాంచైజ్ మోడల్‌లోకి మారవచ్చు.

7. రీఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్స్ (Refurbished Electronics):

పాత ఎలక్ట్రానిక్ వస్తువులను కొని, రిపేర్ చేసి, కొత్త వాటిలా మార్చి అమ్మడం. ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో కొత్త ఫోన్‌లు అమ్ముడవుతున్నాయి. టే కోట్ల సంఖ్యలో పాత ఫోన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాషిఫై (Cashify) వంటి కంపెనీలు పాత ఫోన్‌లను కొని, రిపేర్ చేసి అమ్మడం ద్వారా వేల కోట్ల విలువైన కంపెనీలుగా ఎదిగాయి. రూ.10,000-15,000 పెట్టుబడితో పాత ఫోన్‌లు కొని, చిన్న రిపేర్లు చేసి (బ్యాటరీ, స్క్రీన్ మార్పు), ఒక్కో ఫోన్‌పై రూ.1,000 వరకు లాభం పొందవచ్చు. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లకు కూడా ఈ మోడల్ వర్తిస్తుంది. ఆర్థిక సంక్షోభ సమయాల్లో ఈ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది.

8. ప్రైవేట్ లేబలింగ్ అండ్ ప్యాకేజింగ్ (Private Labelling, Packaging):

చాలా బ్రాండ్‌లు సొంతంగా ఉత్పత్తులను తయారు చేయవు, వేరే ఫ్యాక్టరీల నుండి కొని తమ లేబుల్ అంటించి అమ్ముతాయి. అమెజాన్ బేసిక్స్, ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్‌లు దీనికి ఉదాహరణ. మీరు కూడా ఒక మంచి ఉత్పత్తిని (తేనె వంటిది) ఎంపిక చేసుకుని, ఫ్యాక్టరీ నుండి తక్కువ ధరకు కొని, మీ సొంత బ్రాండింగ్‌తో ప్యాకేజింగ్ చేసి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మవచ్చు. ఒక్కసారి ఉత్పత్తి లిస్ట్ అయ్యి, మంచి రివ్యూలు వస్తే, ఆర్డర్‌లు ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి. మీ వర్కర్స్ ప్యాకింగ్ చేసి, డెలివరీ జరిగి, మీ ఖాతాలోకి డబ్బు చేరుతుంది.

ఇది కూడా చదవండి: House Construction: ఇల్లు కట్టిస్తున్నారా? ఏ పనికి ఎన్ని రోజులు పడుతుంది.. క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి? పూర్తి వివరాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us