పెళ్లి కావాలంటూ సెల్ టవర్ ఎక్కి లవర్‌ని దక్కించుకుంది

|

Mar 06, 2019 | 10:45 AM

వరంగల్: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలని కోరుతూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. దీంతో కంగారుపడిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను కిందకు దించి కోరిన యువకుడితో పెళ్లి జరిపించారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలంలో జరిగింది ఈ సంఘటన. మాలిక అనే యువతి హన్మకొండలో నర్స్‌గా పని చేస్తోంది. అదే ఊరికి చెందిన మోషే, ఆమె ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవలే అతనికి వేరే అమ్మాయితో నిశ్చితార్ధం జరిగిందని తెలవడంతో మాలిక సెల్ టవర్ ఎక్కి […]

పెళ్లి కావాలంటూ సెల్ టవర్ ఎక్కి లవర్‌ని దక్కించుకుంది
Follow us on

వరంగల్: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలని కోరుతూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. దీంతో కంగారుపడిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను కిందకు దించి కోరిన యువకుడితో పెళ్లి జరిపించారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలంలో జరిగింది ఈ సంఘటన. మాలిక అనే యువతి హన్మకొండలో నర్స్‌గా పని చేస్తోంది. అదే ఊరికి చెందిన మోషే, ఆమె ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవలే అతనికి వేరే అమ్మాయితో నిశ్చితార్ధం జరిగిందని తెలవడంతో మాలిక సెల్ టవర్ ఎక్కి ప్రియుడిని దక్కించుకుంది.

హన్మకొండ పోలీసులు సెల్ టవర్ వద్దకు వచ్చి మాలికతో చర్చించారు. మోషేను పోలీస్ స్టేషన్‌కు రప్పించి అతనితో కూడా మాట్లాడారు. కౌన్సెలింగ్ అనంతరం అతను పెళ్లికి అంగీకరించాడు. దీంతో మాలిక కూడా సెల్ టవర్ దిగింది. పోలీసులు దగ్గరుండి పెళ్లి చేశారు. ఏడాది క్రితమే కొత్తగూడెం సింగరేణి సంస్థలో యువకుడికి ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచే పెళ్లికి మాలిక ఒత్తిడి చేస్తూ వచ్చింది.