భారత మీడియాకు పిచ్చి పట్టింది: పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్

|

Feb 26, 2019 | 12:41 PM

ఇస్లామాబాద్: ఇండియన్ మీడియాపై “పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్” వెటకారంగా మాట్లాడింది. భారత మీడియా మానసిక పరిస్థితికి బాలీవుడ్ వల్ల కలిగిన దుష్పలితాలు ప్రమాదకరంగా పరిణమించాయంటూ సెటైర్ వేసింది. ఈ పరిస్థితి వల్ల అద్భుతం జరిగిందనే భ్రమల్లో, మాయలో భారత మీడియా ఉంటుందని విమర్శించింది. భారత వైమానిక దళం చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ యుద్ధ విమానాలు సిద్ధమయ్యాయి. కానీ భారత విమానలు ఎక్కువ సంఖ్యలో ఉండటం చూసి వెనుదిరిగాయని సమాచారం అందుతోంది. అంటూ భారత న్యూస్ ఏజెన్సీ […]

భారత మీడియాకు పిచ్చి పట్టింది: పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్
Follow us on

ఇస్లామాబాద్: ఇండియన్ మీడియాపై “పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్” వెటకారంగా మాట్లాడింది. భారత మీడియా మానసిక పరిస్థితికి బాలీవుడ్ వల్ల కలిగిన దుష్పలితాలు ప్రమాదకరంగా పరిణమించాయంటూ సెటైర్ వేసింది. ఈ పరిస్థితి వల్ల అద్భుతం జరిగిందనే భ్రమల్లో, మాయలో భారత మీడియా ఉంటుందని విమర్శించింది.

భారత వైమానిక దళం చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ యుద్ధ విమానాలు సిద్ధమయ్యాయి. కానీ భారత విమానలు ఎక్కువ సంఖ్యలో ఉండటం చూసి వెనుదిరిగాయని సమాచారం అందుతోంది. అంటూ భారత న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ పోస్ట్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ “పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్” వెటకారంగా స్పందించింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది.

“పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్” అనేది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సొంత పార్టీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చొచ్చుకుని వెళ్లిన భారత వైమానిక దళాలు భీకర దాడిని చేశారు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు భారత వైమానిక దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో 200కి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా భారత రక్షణ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.