చంద్రబాబుపై పోసాని విమర్శలవర్షం

| Edited By:

Oct 18, 2020 | 8:00 PM

తెలంగాణ ఫలితాలు రావడం…టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో…కేసీఆర్‌కు శుభాకంక్షల వెల్లువ మొదలైంది. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అభినందనలు తెలుపుతూ…ట్వీట్లు చేస్తున్నారు. కొందరు ప్రెస్‌మీట్ పెట్టి చెబుతున్నారు. ఈ క్రమంలో పోసాని మురళీకృష్ణ ఇవాళ ఉదయం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోసాని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శలతో దుమ్మెత్తి పోశారు. అరవైయేళ్ల పెద్దావిడకు కూడా…. ఈ క్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీ వైఫల్యాల గురించి చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు […]

చంద్రబాబుపై పోసాని విమర్శలవర్షం
Follow us on

తెలంగాణ ఫలితాలు రావడం…టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో…కేసీఆర్‌కు శుభాకంక్షల వెల్లువ మొదలైంది. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అభినందనలు తెలుపుతూ…ట్వీట్లు చేస్తున్నారు. కొందరు ప్రెస్‌మీట్ పెట్టి చెబుతున్నారు. ఈ క్రమంలో పోసాని మురళీకృష్ణ ఇవాళ ఉదయం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోసాని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శలతో దుమ్మెత్తి పోశారు.

అరవైయేళ్ల పెద్దావిడకు కూడా….

ఈ క్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీ వైఫల్యాల గురించి చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు పోసాని. ” ఆంద్రప్రదేశ్‌లో కమ్మవాళ్లు అంటరానివాళ్లుగా బతుకుతున్నారు. నాకు తెలిసిన కమ్మవాళ్లందరూ అంటరానివారుగానే బతుకుతున్నారు. ఇది చంద్రబాబు వల్లే, టీడీపీ వల్లే జరిగింది. నేను ఎమ్యేలే అభ్యర్థిగా ఒక ప్రాంతంలోకి వెళ్తే ఒక పెద్దావిడ, ఆవిడ కమ్మ చెప్పిన మాటలు…’ మేము కాపులకు ఓటు వేయమయ్యా! కాపులకేస్తే కమ్మోళ్లు నన్ను బతకనివ్వరు. ‘ ఎవరు చెప్పారమ్మా అనడిగితే…మావోళ్లే చెప్పారయ్యా! ఆవిడకు అరవైయేళ్లు. అంత వయసున్న ఆవిడకు కూడా కులం ఎక్కించారు. కమ్మ ఓట్లు కమ్మవాళ్లే వేసుకోవాలని నేర్పించారు. మీకు కులపిచ్చి లేదు. మీ పక్కనున్నవాళ్లు మీక్కూడా ఎక్కించారు. అది తెలుసుకోవట్లేదు మీరు…కులం చెప్పుకోవడమనేది ఉనికి. తప్పులేదు. కానీ ఇలా అందరికీ ఎవరి కులం వాళ్లు వారికే ఓటు వేసుకోవాలని నేర్పిస్తే మీరు సీఎం అవుతారా? ” అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పోసాని.