తీరం దాటింది.. అయినా ఉత్తరాంధ్రకు ముప్పే!

తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం తీరం దాటింది. అయితే దాంతో వర్షాలు ఆగిపోతాయనే ఆనందం వద్దంటున్నారు వాతావరణ విభాగం అధికారులు.

తీరం దాటింది.. అయినా ఉత్తరాంధ్రకు ముప్పే!
Follow us

|

Updated on: Oct 13, 2020 | 5:18 PM

North Andhra still under threat: వాతావరణ శాఖ అంఛనా వేసినట్లుగానే మంగళవారం మధ్యాహ్నం వాయుగుండం కాకినాడకు సమీపంలో తీరం దాటింది. సహజంగా సముద్రం మీద నుంచి భూమ్మీదకు చేరిన వాయుగుండం క్రమంగా బలహీన పడుతుంది. దాంతో వానలు కాస్త.. నెమ్మదిస్తాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం తీరం దాటింది. అయితే దాంతో వర్షాలు ఆగిపోతాయనే ఆనందం వద్దంటున్నారు వాతావరణ విభాగం అధికారులు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలతో ముంచెత్తింది. ఏపీ, తెలంగాణ జిల్లాల్లోని దాదాపు అన్ని ప్రాంతాలు రెండ్రోజులుగా తడిసి ముద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాయుగుండం మంగళవారం తీరం దాటింది. అయితే.. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున వర్షాలు ఇప్పుడే తగ్గుముఖం పట్టవని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

తూర్పు మధ్య అరేబియా సముద్రం, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 3.1 కిలోమీటలర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దానికి తీరం దాటిన వాయుగుండం తోడు కావడంతో మరిన్ని వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వుందంటున్నారాయన.

ఏపీలోని మిగిలిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని… దాంతో ఇప్పటికే పొంగిపొర్లుతున్న నదులు, వాగులు మరింతగా ఉప్పొంగే ప్రమాదం కనిపిస్తోంది.

Also read: రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసల జల్లు

Also read: చంద్రబాబుకు నోటీసిచ్చిన తహసీల్దార్

Also read: ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సినీ నిర్మాత

Also read: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి