సుశాంత్ కేసులో ఫస్ట్ అరెస్ట్

|

Sep 02, 2020 | 9:10 PM

సంచలనం రేపుతోన్న బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మొదటి అరెస్ట్ నమోదైంది. డ్రగ్స్ కోణం బయటపడిన నేపథ్యంలో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో..

సుశాంత్ కేసులో ఫస్ట్ అరెస్ట్
Follow us on

సంచలనం రేపుతోన్న బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మొదటి అరెస్ట్ నమోదైంది. డ్రగ్స్ కోణం బయటపడిన నేపథ్యంలో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బుధవారం అరెస్ట్‌ చేసింది. ఆ ఇద్దరిలో ఒకరైన అబ్దుల్ బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉందని ఎన్‌సీబీ పేర్కొంది. అంతేకాదు, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్టు మాకు తెలిసిందని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. గత ఏడాది మేలో మిరాండాను సుశాంత్‌ ఇంట్లో మేనేజర్‌గా రియా నియమించిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఇంటికి సంబంధించి మిరిండానే అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవాడు. మరోవైపు సుశాంత్‌ డబ్బును రియా కాజేయడంలో మిరాండా కీలకపాత్ర పోషించాడని సుశాంత్ కుటుంబ సభ్యులు గతంలోనే ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.