నేను ఫైర్ చేయలేదు, నమ్మండి. ఓ సైనికుని వ్యధ

| Edited By: Pardhasaradhi Peri

Oct 17, 2020 | 1:19 PM

యూపీలోని బలియా జిల్లా దుర్జాన్ పూర్ గ్రామంలో కాల్పులు  జరిగిన ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. అయితే ఇందుకు తనను బాధ్యుడ్ని చేస్తున్నారని ధీరేంద్ర సింగ్ అనే సైనికుడు వాపోతున్నాడు. ఎవరో కాల్పులు జరిపితే తనను ఇరికిస్తున్నారని ఆయన చెప్పాడు. నేను సోల్జర్ని,, 18 ఏళ్ళు దేశ సేవ చేశా.. ఈ కాల్పుల ఘటనపై విచారణ జరిపించాలని సీఎంని కోరుతున్నా అని ధీరేంద్ర సింగ్ అన్నాడు.  బీజేపీ  ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కి కి ఈయన సహచరుడు. […]

నేను ఫైర్ చేయలేదు, నమ్మండి. ఓ సైనికుని వ్యధ
Follow us on

యూపీలోని బలియా జిల్లా దుర్జాన్ పూర్ గ్రామంలో కాల్పులు  జరిగిన ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. అయితే ఇందుకు తనను బాధ్యుడ్ని చేస్తున్నారని ధీరేంద్ర సింగ్ అనే సైనికుడు వాపోతున్నాడు. ఎవరో కాల్పులు జరిపితే తనను ఇరికిస్తున్నారని ఆయన చెప్పాడు. నేను సోల్జర్ని,, 18 ఏళ్ళు దేశ సేవ చేశా.. ఈ కాల్పుల ఘటనపై విచారణ జరిపించాలని సీఎంని కోరుతున్నా అని ధీరేంద్ర సింగ్ అన్నాడు.  బీజేపీ  ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కి కి ఈయన సహచరుడు. జైప్రకాష్ అనే వ్యక్తికి, ధీరేంద్రకి మధ్య గొడవ జరిగిన మాట నిజమేనని, అతనిపై  ధీరేంద్ర మూడు సార్లు కాల్పులు జరిపాడని సురేంద్ర సింగ్ ఓ వైపు చెబుతుంటే మరోవైపు ధీరేంద్ర మాత్రం అసలు తాను ఫైర్ చేయనేలేదని, తనపైనే దాడి జరిగిందని అంటున్నాడు. కాగా ఈ సంఘటన తాలూకు వీడియో చూసి తాము అసలు క్రిమినల్ ని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.