జంతువులపై కోవాగ్జిన్ ట్రయల్ టెస్ట్ సక్సెస్, భారత్ బయో టెక్

| Edited By: Anil kumar poka

Sep 12, 2020 | 4:19 PM

తాము ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ కరోనా వైరస్ వ్యాక్సీన్  తో జంతువులపై జరిపిన ట్రయల్ టెస్ట్ సక్సెస్ అయిందని భారత్ బయో టెక్ సంస్థ ప్రకటించింది.  ఈ టెస్టులో మంచి ఫలితాలు కనిపించాయని పేర్కొంది.

జంతువులపై కోవాగ్జిన్ ట్రయల్ టెస్ట్ సక్సెస్, భారత్ బయో టెక్
Follow us on

తాము ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ కరోనా వైరస్ వ్యాక్సీన్  తో జంతువులపై జరిపిన ట్రయల్ టెస్ట్ సక్సెస్ అయిందని భారత్ బయో టెక్ సంస్థ ప్రకటించింది.  ఈ టెస్టులో మంచి ఫలితాలు కనిపించాయని పేర్కొంది. ఈ వ్యాక్సీన్  తో వాటిలో రోగనిరోధక శక్తి పెరిగిందని ఈ కంపెనీ వెల్లడించింది. ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సీన్ ఫ్రంట్ రన్నర్ రేసులో కోవాగ్జిన్ ఒకటి.  ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సీన్ ని దేశ వ్యాప్తంగా 12 సంస్థల్లో టెస్ట్ చేస్తున్నారు. ఇలా ఉండగా ఇండియాలో గత 24 గంటల్లో 1,201 కరోనా మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 77,472 కి పెరిగింది.