కోవిడ్ తరుణంలో వృధ్ధులపై ‘సుప్రీం’ ‘ప్రేమ’ ! రాష్ట్రాలకు ఆదేశం

| Edited By: Anil kumar poka

Sep 07, 2020 | 6:37 PM

దేశాన్ని కుదివేస్తున్న ఈ కోవిడ్ పాండమిక్ తరుణంలో వృధ్ధుల సంక్షేమానికి, వారికి కల్పిస్తున్న  సౌకర్యాలపై వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని  సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకూ సూచించింది. ఇందుకు 4 వారాల గడువునిచ్చింది.

కోవిడ్ తరుణంలో వృధ్ధులపై సుప్రీం ప్రేమ ! రాష్ట్రాలకు ఆదేశం
Follow us on

దేశాన్ని కుదివేస్తున్న ఈ కోవిడ్ పాండమిక్ తరుణంలో వృధ్ధుల సంక్షేమానికి, వారికి కల్పిస్తున్న  సౌకర్యాలపై వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని  సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకూ సూచించింది. ఇందుకు 4 వారాల గడువునిచ్చింది. వారందరికీ రెగ్యులర్ గా పింఛన్లు అందేలా చూడాలని, మాస్కులు, శానిటైజర్లు, ఇతర అత్యవసరాలను సమకూర్చాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ గత ఆగస్టు 4 నే ఆదేశించింది. ఈ కరోనా వైరస్ ప్రబలిన సమయంలో వయస్సు మళ్లినవారిపట్ల మరింత శ్రద్ద అవసరమని పరోక్షంగా తీవ్రంగా సూచన చేసింది. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ లాయర్ అయిన అశ్వినీ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ని పురస్కరించుకుని కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. దేశంలో గత 24 గంటల్లో కరోనా ఇన్ఫెక్షన్లు సోకినవారి సంఖ్య 42 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 1,016 కి చేరిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు మాత్రమే వృధ్ధుల విషయంలో తాము తీసుకున్న చర్యల గురించి తమ అఫిడవిట్లలో పేర్కొన్నాయని అశ్వినీ కుమార్ కోర్టుకు తెలిపారు.