Numerology: మీ జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా మూలాంకాన్ని లెక్కించి, జీవితంలో కీలకమైన మార్పు లేదా టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవచ్చని న్యూమరాలజీ చెబుతోంది. 1 నుంచి 9 వరకు ఉండే మూలాంకాలకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుందని, వాటి ఆధారంగా జీవితంలోని ముఖ్యమైన మలుపులను అంచనా వేస్తారు.

Numerology: మీ జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
Numerology Turning Point In Life

Updated on: Aug 26, 2026 | 6:16 PM

సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) ప్రకారం పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సంఖ్యా శాస్త్రం మేరకు పుట్టిన తేదీ ఆధారంగా ఏ వయస్సులో ఒకరి జీవితంలో అతిపెద్ద మార్పు లేదా టర్నింగ్ పాయింట్ వస్తుందో లెక్కిస్తారు. పుట్టిన తేదీ ఆధారంగా వచ్చే మూలాంకం 1 నుండి 9 వరకు ఏ వయస్సులో జీవితంలో గొప్ప మలుపు తిరిగే అవకాశముందో లెక్కిస్తారు. ఒక్కో తేదీల్లో పుట్టిన వారికి ఒక్కో మూలాంకం ఉంటుంది. ఈ మూలాంకానికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. మీ పుట్టిన తేదీ ఆధారంగా మూలాంకాన్ని గుర్తించి.. దాని ఆధారంగా మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుందో తెలుసుకోండి.

మూలాంకం 1

ఏదైనా నెలలో 1, 10, 19 లేదా 28 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 1. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. సంఖ్యా శాస్త్రం మేరకు వీరికి
22 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సులో టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశముంది. ఈ వయస్సులో వీరి జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. వీరిలో నాయకత్వ లక్షణాలు (Leadership skills) పెరుగుతాయి. అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి.

మూలాంకం 2

ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 2. ఈ తేదీల్లో పుట్టిన వారికి చంద్రుడు అధిపతి. సంఖ్యా శాస్త్రం మేరకు 24 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సులో వీరికి టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఈ వయస్సులో వీరి జీవితంలో సంతోషం నెలకొంటుంది. ముఖ్యంగా వివాహం తర్వాత వీరి జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు.

ఇవి కూడా చదవండి

మూలాంకం 3

ఏదైనా నెలలో 3, 12, 21 లేదా 30 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 3. ఈ తేదీల్లో పుట్టిన వారికి గురుడు అధిపతి. సంఖ్యా శాస్త్రం మేరకు 24 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సులో వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచే అవకాశముంది. ఈ వయస్సులో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా వీరి ప్రేమ జీవితం, కెరీర్‌లో పెద్ద విజయాలు సాధిస్తారు.

మూలాంకం 4

4, 13, 22 లేదా 31 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 4. ఈ తేదీల్లో పుట్టిన వారికి రాహువు అధిపతి. సంఖ్యా శాస్త్రం మేరకు 30 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సులో వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఉండే అవకాశముంది. ఈ వయస్సు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక స్థితిలో ఊహించని పెద్ద మార్పులు వస్తాయి.

మూలాంకం 5

5, 14 లేదా 23 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 5. ఈ తేదీల్లో పుట్టిన వారికి బుధుడు అధిపతి. సంఖ్యా శాస్త్రం మేరకు 32 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సులో వీరి జీవితంలో గొప్ప మార్పునకు అవకాశముంది. ఈ సమయంలో జీవితంలో స్పష్టమైన మార్పును గమనిస్తారు. వ్యాపారం, ఉద్యోగం లేదా నచ్చిన రంగంలో గొప్ప అవకాశాలతో పాటు మంచి ధన లాభం పొందుతారు.

మూలాంకం 6

ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 6. ఈ తేదీల్లో పుట్టిన వారికి శుక్రుడు అధిపతి. సంఖ్యా శాస్త్రం మేరకు వీరి జీవితంలో 25 నుండి 35 సంవత్సరాల మధ్య గొప్ప మలుపు సంభవించే అవకాశముంది. ఈ దశలో జీవితంలో అతిపెద్ద అనుకూల మార్పు వచ్చే అవకాశం నిండుగా ఉంటుంది. జీవితంలో భౌతిక సుఖసంతోషాలు, సౌకర్యాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.

మూలాంకం 7

ఏదైనా నెలలో 7, 16 లేదా 25 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 7. ఈ తేదీల్లో పుట్టిన వారికి కేతువు అధిపతి. సంఖ్యా శాస్త్రం మేరకు 30 నుండి 38 సంవత్సరాల మధ్య వీరి జీవితంలో గొప్ప మార్పు సంభవించే అవకాశముంది. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ కాస్త ఆలస్యంగా వస్తుంది. ఈ వయస్సులో కెరీర్, ఆలోచనా విధానం లేదా జీవనశైలిలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి.

మూలాంకం 8

ఏదైనా నెలలో 8, 17 లేదా 26 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8. ఈ తేదీల్లో పుట్టిన వారికి శనీశ్వరుడు అధిపతి. సంఖ్యా శాస్త్రం మేరకు 35 నుండి 36 సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో గొప్ప మలుపు తిరిగే అవకాశముంది. వీరు సుఖాలను పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. 35-36 ఏళ్ల తర్వాత హఠాత్తుగా పెద్ద మార్పు వస్తుంది. కష్టం తర్వాత లభించే విజయం శాశ్వతంగా నిలిచిపోతుంది.

మూలాంకం 9

ఏదైనా నెలలో 9, 18 లేదా 27 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 9. ఈ తేదీల్లో పుట్టిన వారికి కుజుడు అధిపతి. వీరి జీవితంలో 28 నుండి 32 సంవత్సరాల మధ్య కాలంలో గొప్ప మలుపు చోటు చేసుకునే అవకాశముంది. వయస్సులో జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. కెరీర్ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించి వీరు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

(సంఖ్యా శాస్త్రం ఒక నమ్మకంతో కూడిన విధానం మాత్రమే. మూలాంకం ఆధారంగా వ్యాపార విజయం ఖచ్చితంగా నిర్ణయించబడుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యాపారంలో విజయం సాధించడానికి మార్కెట్ అవగాహన, సరైన ప్రణాళిక, పెట్టుబడి నిర్వహణ, కష్టపడి పనిచేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం కీలకం)

Loading...
Unable to load recommendations.
Follow Us