Horoscope Today (October 28th 2021): కొంతమంది తాము పని మొదలుపెట్టాలన్నా కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 28వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి వాహనం కొనుగోలు యోగం ఉంది. ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జీవితంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబంతో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. గొంతు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది… అందుకని చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది.
మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం పొందుతారు. పెద్దల ఆస్థి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబం సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభవార్త వింటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. అనవసర విషయాల్లో తలదూర్చడంవలన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఈ రాశివావారు ఈరోజు అనుకూల పరిస్థితులు ఉంటాయి. పట్టుదలతో చేపట్టిన కొన్ని పనులను పూర్తి చేసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
సింహ రాశి: ఈరాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంది. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక ధన లాభం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్తపనులు చేపట్టేవారు వాయిదా వేసుకోవడం మంచిది.
తులా రాశి: ఈ రాశివారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి మంచి ఆఫర్ లభిస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.
ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశికి ఆకస్మిక ధన లాభం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీలైనంత వరకూ స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండడం మంచిది.
మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి ప్రేమ, మద్దతు పొందుతారు. వీలైనంత వరకు అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది.
కుంభ రాశి: ఈరోజు ఈ రాశి వారు కోర్టు కేసుల నుంచి బయటకు వస్తారు. ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
మీన రాశి: ఈ రాశివారు ఈరోజు విద్యార్థులు శుభ ఫలితాలు పొందుతారు. శుభవార్త వింటారు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది.
Also Read: ఇరు రాష్ట్రాల ప్రజల నీటి అవసరాలను భవిష్యత్‌ను కాపాడుకుందామని కేరళ సీఎంకు.. స్టాలిన్ లేఖ..