ఫెంగ్ షుయ్ హ్యాక్స్: మీ అదృష్టాన్ని పెంచి.. నెగటివ్ ఎనర్జీ తొలగించే వస్తువులు ఇవే..!

Feng Shui Home Items: వాస్తు శాస్త్రంలా, ఫెంగ్ షుయ్ కూడా చైనీస్ నిర్మాణ సాంకేతికత. దీన్ని పాటిస్తే ఇంటికి సానుకూల శక్తి, శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. కొన్ని ప్రత్యేక వస్తువులు ఉంచడం ఆనందం, శ్రేయస్సు పెంచి ఆర్థిక సమస్యలను తగ్గిస్తాయని ఫెంగ్ షుయ్ సూచిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.

ఫెంగ్ షుయ్ హ్యాక్స్: మీ అదృష్టాన్ని పెంచి.. నెగటివ్ ఎనర్జీ తొలగించే వస్తువులు ఇవే..!
Feng Shui

Updated on: Mar 07, 2026 | 10:06 PM

Feng Shui Essentials: ఫెంగ్ షుయ్.. మనదేశంలోని వాస్తు శాస్త్రం లాంటిదే. ఇది చైనీస్ నిర్మాణ సాంకేతికతలో ఒక ప్రముఖ విధానం. చాలా మంది ఫెంగ్ షుయ్ సూచనలను పాటిస్తే.. ఇంటికి సానుకూల శక్తులు, శ్రేయస్సు పెరుగుతాయని నమ్ముతారు. కొన్ని ప్రత్యేక వస్తువులు, అలంకరణలు ఇంట్లో ఉంచడం ద్వారా ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని ఫెంగ్ షుయ్ సూచిస్తుంది.

ఇంట్లో ఉంచవలసిన వస్తువులు, వాటి ప్రయోజనాలు

చిత్రాలు

సూర్యోదయాలు, పర్వతాలు, జలపాతాలు, గుర్రాల చిత్రాలు ఉంచడం శ్రేయస్సు, విజయాలు, అవకాశాలను పెంచుతుంది.
నైరుతి (Northwest) దిశలో నవ్వుతున్న కుటుంబ ఫోటో ఉంచడం కుటుంబ సంబంధాలను బలోపేతం చేస్తుంది.

మొక్కలు

వెదురు చెట్టు: కుటుంబ సభ్యులు సమావేశమయ్యే ప్రదేశంలో ఉంచితే శ్రేయస్సు పెరుగుతుంది.

మనీ ప్లాంట్: ఇంటి ఆగ్నేయ (Southeast) దిశలో ఉంచడం ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది.

తాబేలు విగ్రహం

ఫెంగ్ షుయ్ ప్రకారం, తాబేలు సంపద, శ్రేయస్సుకు చిహ్నం. ఇంటి ఉత్తర (North) దిశలో ఉంచడం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది.

ఫౌంటెన్ లేదా అక్వేరియం

ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య (Northeast) దిశలో ఉంచితే సానుకూల శక్తిని పెంచుతుంది.

విండ్ చైమ్స్

ఇంటి అందాన్ని పెంచడం మాత్రమే కాదు, ప్రతికూల శక్తిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రధాన ద్వారం దగ్గర లేదా కిటికీలపై ఉంచడం ఉత్తమం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, వాస్తు, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Loading...
Unable to load recommendations.
Follow Us