వివేక హత్యకేసులో కొత్త ట్విస్ట్.. కూతురు చేయాల్సింది నేనే..

| Edited By:

Dec 13, 2019 | 6:19 PM

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో అమాయకులు బలికావొద్దంటే.. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. గతకొద్దిరోజులుగా వివేక హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో బీటెక్‌ రవిని కూడా నాలుగురోజుల క్రితం విచారించింది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ హత్య వెనుక తన ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. వివేక అజాతశత్రువని.. […]

వివేక హత్యకేసులో కొత్త ట్విస్ట్.. కూతురు చేయాల్సింది నేనే..
Follow us on

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో అమాయకులు బలికావొద్దంటే.. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. గతకొద్దిరోజులుగా వివేక హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో బీటెక్‌ రవిని కూడా నాలుగురోజుల క్రితం విచారించింది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ హత్య వెనుక తన ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. వివేక అజాతశత్రువని.. ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అంతేకాదు.. ఆరు నెలల తర్వాత సిట్ తమని విచారించడం వెనుక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ కేసులో అమాయకులు బలికావద్దంటే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలంటూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వివేక కూతురే స్వయంగా సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ ప్రశ్నించారు. వివేక కూతురు చేయాల్సిన పని తాను చేశానంటూ బీటెక్ రవి చెప్పుకొచ్చారు. కాగా ఈ పిటిషన్ తాను వ్యక్తిగతంగా వేసానని.. దీనికి పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు.