చెల్లెలికి న్యాయం చేయాలంటూ..పెట్రోల్‌ డబ్బాతో అన్న హల్‌చల్‌

|

Dec 19, 2019 | 4:13 PM

గుంటూరు నగరం పాలెం పోలీస్‌ స్టేషన్‌ ముందు కుటుంబ సభ్యులతో కలిసి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అత్తారింట్లో తన చెల్లెలికి సంబంధించిన వివాదాన్ని పోలీసులు పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు చెల్లెలితో కలిసి ఆందోళనకు దిగాడు. పోలీసులు అతని వద్ద ఉన్న పెట్రోల్ డబ్బాను బలవంతంగా లాక్కున్నారు. వివరాల్లోకి వెళితే.. చుట్టుగుంటకు చెందిన మాధవికి గుజ్జనగుండ్లకు చెందిన కాశీ విశ్వనాథరెడ్డితో పన్నేండేళ్ల క్రితం వివాహం జరిగింది. […]

చెల్లెలికి న్యాయం చేయాలంటూ..పెట్రోల్‌ డబ్బాతో అన్న హల్‌చల్‌
Follow us on
గుంటూరు నగరం పాలెం పోలీస్‌ స్టేషన్‌ ముందు కుటుంబ సభ్యులతో కలిసి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అత్తారింట్లో తన చెల్లెలికి సంబంధించిన వివాదాన్ని పోలీసులు పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు చెల్లెలితో కలిసి ఆందోళనకు దిగాడు. పోలీసులు అతని వద్ద ఉన్న పెట్రోల్ డబ్బాను బలవంతంగా లాక్కున్నారు. వివరాల్లోకి వెళితే..
చుట్టుగుంటకు చెందిన మాధవికి గుజ్జనగుండ్లకు చెందిన కాశీ విశ్వనాథరెడ్డితో పన్నేండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, కుటుంబ కలహాల కారణంగా మాధవి గత నాలుగేళ్లుగా తన భర్తతో విడిపోయి కన్నవారింటి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమె భర్త మృతి చెందినా తమకు సమాచారం లేదని… చివరికి పెద్ద కర్మ రోజు తనను అనుమతించడం లేదని యువతి వాపోయింది. భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితురాలు ఆమె అన్న, అమ్మతో కలిసి పీఎస్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టింది. చేతిలో పెట్రోల్‌ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిని వారిని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే, మాధవి అత్తింటి వారు మాత్రం ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇరువురు కుటుంబీకులకు పోలీసులు సర్ధి చెప్పారు. కాగా, ఇది రెండు కుటుంబాల సమస్య కావటంతో చట్టపరంగా ఉన్న అవకాశాలను పరిశీలించి… వివాద పరిష్కారానికి కృషి చేస్తామని సీఐ వెంకటరెడ్డి తెలిపారు.