మరోసారి కరోనాకు గురైన వైసీపీ ఎమ్మెల్యే.. రీ ఇన్ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యంగా ఉందని వెల్లడి..

|

Dec 05, 2020 | 6:51 PM

కరోనా సాధారణ పౌరులనే కాకుండా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలను కూడా వదలడం లేదు.

మరోసారి కరోనాకు గురైన వైసీపీ ఎమ్మెల్యే.. రీ ఇన్ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యంగా ఉందని వెల్లడి..
Ambati Rambabu
Follow us on

కరోనా సాధారణ పౌరులనే కాకుండా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. ఇటీవల కరోనాతో పోరాడుతూ చాలామంది ముఖ్యులు మ‌ృతిచెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రజల్లో తిరిగే రాజకీయ నాయకులు కరోనా భారిన ఎక్కువగా పడుతున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనాకు గురయ్యారు.

ఇప్పటికే ఓ సారి కరోనా బారిన పడిన ఆయన తాజాగా మళ్లీ వైరస్ సోకినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘జులైలో నాకు కొవిడ్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. దానిని తగ్గించుకొని ప్రజల్లోకి వచ్చా. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మళ్లీ కొవిడ్ టెస్ట్ చేయించాను. దీంతో పాజిటివ్‌గా వచ్చింది’ అని తెలిపారు. రీ ఇన్ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యకరంగా ఉందని, వెంటనే ఆస్పత్రిలో చేరి మళ్లీ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాకే మీ ముందుకు వస్తానని ప్రకటించారు. అయితే ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి కూడా రెండోసారి కరోనా సోకింది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో వెంటనే ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కొవిడ్ ఒకసారి వచ్చి వెళ్లిన తర్వాత మళ్లీ రాదనుకోవడం భ్రమే అవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా ప్రజలందరు కొవిడ్ నిబంధనలు పాటించి పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు.