శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే అనుచరుడి హత్య.. సీతారామపురంలో అర్ధరాత్రి బీభత్సం..

|

Aug 04, 2024 | 12:30 PM

నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో అర్ధరాత్రి బీభత్సం జరిగింది. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి అనుచరులైన ముగ్గురు వైసీపీ నేతలను హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్లాన్ చేశారు. మద్యం సేవించి రాత్రి 12 గంటల ప్రాంతంలో వేటకొడవళ్లు, రాళ్లు, కర్రలతో బయలుదేరారు.

శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే అనుచరుడి హత్య.. సీతారామపురంలో అర్ధరాత్రి బీభత్సం..
Ap News
Follow us on

నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో అర్ధరాత్రి బీభత్సం జరిగింది. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి అనుచరులైన ముగ్గురు వైసీపీ నేతలను హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్లాన్ చేశారు. మద్యం సేవించి రాత్రి 12 గంటల ప్రాంతంలో వేటకొడవళ్లు, రాళ్లు, కర్రలతో బయలుదేరారు. సమాచారం తెలుసుకొని సిబ్బందితో మహానంది ఎస్సై నాగేంద్ర గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో వారికి నిందితులు హెచ్చరికలు జారీచేశారు. అడ్డువస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని ఎస్సై, పోలీసులను బెదిరించారు. ఇద్దరిని పోలీసులు రక్షించి తీసుకెళ్లారు..

ముందు వైసీపీ నేత జయనారప రెడ్డిని హత్య చేయాలన్నది వారి ప్లాన్. సమాచారం తెలుసుకుని నారపరెడ్డిని రక్షించి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరో వైసీపీ నేత తప్పించుకున్నారు. ఇంటిలోనే ఉండి పోవడంతో సుబ్బరాయుడిని అతి కిరాతకంగా హత్య చేశారు ప్రత్యర్థులు. వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేసి అద్దాలు, తలుపులు పగలగొట్టారు. కనిపించిన మోటార్ బైకులను ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గ్రామాన్ని సందర్శించారు.

హత్యపై గ్రామానికి చెందిన టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి సహా మరికొందరిపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారన్నారు డీఎస్పీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఇది ఎన్నికల ప్రతీకారంలో భాగంగా జరిగిన హత్యేనని డీఎస్పీ పేర్కొన్నారు.

పోలీసుల సమక్షంలో హత్య జరగడం శాంతి భద్రతలు దిగజారాయనడానికి నిదర్శనమని అన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. ప్రభుత్వ హత్యల్లో భాగంగానే సీతారామపురంలో ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేసి అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..