Andhra Pradesh: ఇంటికి దారిలేకుండా గోడ కట్టిన స్థానికులు.. వీల్‌ చైర్‌‌పై తాడేపల్లికి యాత్ర..!

|

Jun 19, 2022 | 5:41 AM

Andhra Pradesh: సమస్య ఉందని అధికారులకు విన్నవించింది ఆ మహిళ. కానీ, సమస్య తీరలేదు. న్యాయం చేయాలని ఎన్నో గడపలు తొక్కింది.

Andhra Pradesh: ఇంటికి దారిలేకుండా గోడ కట్టిన స్థానికులు.. వీల్‌ చైర్‌‌పై తాడేపల్లికి యాత్ర..!
Thadepalle
Follow us on

Andhra Pradesh: సమస్య ఉందని అధికారులకు విన్నవించింది ఆ మహిళ. కానీ, సమస్య తీరలేదు. న్యాయం చేయాలని ఎన్నో గడపలు తొక్కింది. కానీ, ఫలితం లేదు. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటికి దారిలేకుండా చేశారు అక్కడి స్థానికులు. ఏకంగా దారికి అడ్డంగా గోడ కట్టారు. దీంతో అధికారులను ఆశ్రయించింది బాధిత మహిళ. కానీ, ఫలితం లేదు. దీంతో నేరుగా ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి తమగోడు చెప్పుకునేందుకు యాత్రగా బయలుదేరింది, బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెనికి చెందిన సుధారాణి.

తన పిల్లలతో కలిసి వీల్‌ చైర్‌ సాయంతో, తాడేపల్లికి బయలుదేరింది. రెండేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నారు సుధారాణి. అప్పటినుంచి స్థానికులకు బాధితురాలికి మధ్య వివాదం జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు అర్జీలు ఇచ్చినా, సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు సుధారాణి. ఇంటికి వెళ్లే దారిలో గోడ నిర్మించారని వాపోయారు. ఈ సమస్య పరిష్కారం కోసం బాధిత కుటుంబం తాడేపల్లికి పాదయాత్రగా బయలుదేరింది. సుధారాణికి అనారోగ్యంగా ఉండటంతో చక్రాల కుర్చీలో కూర్చుంది. మిగిలిన కుటుంబ సభ్యులు పాదయాత్ర చేస్తున్నారు. జగన్ దృష్టికి తీసుకెళితే తమ సమస్య పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు సుధారాణి.