ఆదివాసీల గెలుపు: అక్కడ మైనింగ్‌‌కు నో చెప్పిన జగన్

|

Jun 04, 2019 | 6:17 PM

విశాఖపట్నం: ఎట్టకేలకు ఆదివాసీల పోరాటానికి గెలుపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో అనుమతులు లేని మైనింగ్‌లకు జగన్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. గత కొద్దిరోజులుగా గిరిజనులు నివాసముండే ప్రాంతాల్లో గ్రనైట్ మైనింగ్ జరుగుతోంది. అయితే ఈ మైనింగ్ వల్ల ఆదివాసీలకు తీవ్రమైన సమస్యలు తలెత్తాయి. మూడు షిప్టుల్లో క్వారీల్లో పనులు జరుగుతుండటం..మైనింగ్ కోసం బ్లాస్ట్‌లు చేస్తుండటంతో నిత్య శబ్దాల వల్ల కనీసం నిద్రకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు ఈ ఇబ్బంది మరీ ప్రాణసంకటంగా మారింది. […]

ఆదివాసీల గెలుపు: అక్కడ మైనింగ్‌‌కు నో చెప్పిన జగన్
Follow us on

విశాఖపట్నం: ఎట్టకేలకు ఆదివాసీల పోరాటానికి గెలుపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో అనుమతులు లేని మైనింగ్‌లకు జగన్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. గత కొద్దిరోజులుగా గిరిజనులు నివాసముండే ప్రాంతాల్లో గ్రనైట్ మైనింగ్ జరుగుతోంది. అయితే ఈ మైనింగ్ వల్ల ఆదివాసీలకు తీవ్రమైన సమస్యలు తలెత్తాయి. మూడు షిప్టుల్లో క్వారీల్లో పనులు జరుగుతుండటం..మైనింగ్ కోసం బ్లాస్ట్‌లు చేస్తుండటంతో నిత్య శబ్దాల వల్ల కనీసం నిద్రకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు ఈ ఇబ్బంది మరీ ప్రాణసంకటంగా మారింది. ఈ మైనింగ్ కళ్యాణలోవ డ్యామ్‌కు అతిసమీపంలో జరుగుతుండటంతో రిజర్వాయర్‌లో నీళ్లు అడుగుంటిపోతున్నాయి. దీంతో చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలకు నీటి సమస్య తలెత్తుతోంది. అంతేకాదు మైనింగ్ చేయడం వల్ల డ్యామ్ దాదాపు ఎండిపోయే స్థితికి చేరుకుంది. ఇక సాగుకు కూడా నీరుఅందని పరిస్థితి నెలకొంది.  దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు సామాజిక కార్యకర్తలు ఆదివాసీలతో కలిసి పోరాటం చేస్తున్నారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణ వర్కర్ల అసోసియేషన్‌ కమీటీలో సభ్యుడైన పీఎస్ అజయ్ కుమార్ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం రాగానే ఆదివాసీల వేదన విని వెంటనే మైనింగ్ ఆపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మైనింగ్ కోసం అనుమతులు ప్రయత్నించిన ఆయా కంపెనీలకు నిరాశ తప్పదని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. జలవనరుల శాఖ మైనింగ్‌కు అనుమతులు ఇవ్వలేదని వెల్లడించారు. ఇక క్వారీలు లీజు తీసుకునేందుకు కూడా అనుమతులు లేవని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు.

1978లో కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.దీన్ని వరాహ నదిపై నిర్మించిన ఈ నది సాగునీరు అవసరాలను తీర్చేది.ఇక దాదాపు 10వేల ఎకరాలకు నీరు అందిస్తోంది ఈ రిజర్వాయర్.అంతేకాదు గిరిజన గ్రామాలకు తాగునీరును కూడా అందిస్తోంది.ఇక మైనింగ్ కోసం వచ్చిన పలు కంపెనీలు రిజర్వాయర్‌లోకి నీరు వచ్చే కాలువలను మూసివేశారని గిరిజనులు చెబుతున్నారు. అంతేకాదు పంచాయతీరాజ్ శాఖ రోడ్లు వేస్తే మైనింగ్ కంపెనీలు సామగ్రిని తరలించేందుకు భారీ వాహనాలు వినియోగించాయని దీంతో రహదారులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.