Wedding Season Ends : మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే త్వరపడండి.. ఆలస్యమైతే ఆగాల్సిందే..

|

Jan 04, 2021 | 3:31 PM

Wedding Season Ends :పెళ్లి చేసుకునే యువత త్వరపడండి ఆలస్యమయితే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ముగుస్తున్నాయి.

Wedding Season Ends : మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే త్వరపడండి.. ఆలస్యమైతే ఆగాల్సిందే..
WEDDING
Follow us on

Wedding Season Ends :పెళ్లి చేసుకునే యువత త్వరపడండి ఆలస్యమయితే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ముగుస్తున్నాయి. అవును మీరు విన్నది నిజమే. ఈ నెల 8వ తేదీ వరకే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలంటే మే వరకూ ఆగాల్సిందేనని సిద్ధాంతులు చెబుతున్నారు.

ఈ నెల 8తో పెళ్లి ముహూర్తాలకు శుభం కార్డు పడితే, తిరిగి మే 14న మంచి ముహూర్తం ఉంది. అప్పటి నుంచి మళ్లీ పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు అనేవి ఉండవని అర్చకులు అంటున్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకూ అంటే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి14వ తేదీ మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ సుమారు 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు.

ఆ తర్వాత శుభ దినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజులు మాత్రమేనని ఉంటాయని చెబుతున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఆ సమయంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని అంటున్నారు. 2021లో బలమైన ముహూర్తాల కొరత ఎక్కువగానే ఉంటోందని అర్చకులు అంటున్నారు. ఇన్నాళ్లు కొవిడ్‌ ప్రభావంతో పెళ్లిళ్లకు బ్రేక్‌ పడితే, ఇప్పుడు నెలల తరబడి సుముహూర్తాలు లేవనే అంశం పెళ్లిపీటలు ఎక్కబోవాలనుకునే వారిని నిరుత్సాహపరుస్తున్నాయి.