అల్పపీడన ద్రోణి/గాలులు కోత ఇప్పుడు పశ్చిమ విదర్భ నుండి మరాట్వాడా మీదుగా అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి , సగటు సముద్ర మట్టానికి 1 . 5 కి.మీ ఎత్తులో కోనసాగుతున్నది.
ఆంధ్రప్రదేశ్, యానంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అకాల వర్షాలకు ఇప్పటికే మామిడి, మొక్కజొన్న, వరి, బొప్పాయి వంటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోసారి వర్ష సూచన రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
గురువారం, శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
గురువారం :-వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.
శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది .
శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
గురువారం, శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..