AP Weather Report: దేశం నుంచి నిష్క్రమిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఎంటరైన ఈశాన్య రుతుపవనాలు.. ఏపీకి వర్ష సూచన..

|

Oct 25, 2021 | 10:33 PM

AP Weather Report: భారత దేశం నుంచి నైరుతి రుతు పవనాలు విరమించుకుంటున్నాయని, దాని ఫలితంగానే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

AP Weather Report: దేశం నుంచి నిష్క్రమిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఎంటరైన ఈశాన్య రుతుపవనాలు.. ఏపీకి వర్ష సూచన..
Ap Weather Report
Follow us on

AP Weather Report: భారత దేశం నుంచి నైరుతి రుతు పవనాలు విరమించుకుంటున్నాయని, దాని ఫలితంగానే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే, ఈశాన్య రుతుపవనాలు దిగువ ట్రోపోస్ఫెర్రిక్ స్థాయిలలో వీస్తున్నాయని తెలిపారు. భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ 25న ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో మంగళవారం నాడు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాగల 48 గంటలలో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

వీటి ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వాతావరణ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయనే దానికి సంబంధించిన నివేదికను అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నివేదిక ఆధారంగా. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తాంధ్రాలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాలలో కురిసే ఛాన్స్ ఉంది. అలాగే ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడనున్నాయి. ఇక రాయలసీమలో దాదాపుగా ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. ఈరోజు, రేపు ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

Also read:

JioPhone Next: ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్.. అదిరిపోయేలా ఫోన్ మేకింగ్ వీడియో..

Shiny and Smooth Hair: పట్టు కుచ్చులా మెరిసే కురుల కోసం కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

Viral Video: ఓ యువతా ఇదేనా మీకు చదువు నేర్పిన సంస్కారం.. గుండె మండే వీడియో ఇది..