Andhra Rains: ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్.. వర్షాలకు అవకాశం.. వాతారవణశాఖ రిపోర్ట్ ఇదే

|

Nov 07, 2022 | 1:26 PM

ఏపీలో గతవారం భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షపాతం నమోదయ్యింది. కాగా మరోసారి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.

Andhra Rains:  ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్.. వర్షాలకు అవకాశం.. వాతారవణశాఖ రిపోర్ట్ ఇదే
AP Weather Alert
Follow us on

ఏపీని వానలు వీడే ఛాన్సులు కనిపించడం లేదు. ఇప్పటికే దండిగా వర్షపాతం నమోదయ్యింది. ఇప్పుడు మరో అల్పపీడనం అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో నవంబర్ 9న ఈ అల్పపీడనం ఛాన్స్ ఉందని తెలిపింది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ స్వల్పంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. ఇది పుదుచ్చేరి, చెన్నై మధ్య 11, 12న తీరం దాటే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు.  ఈ అల్పపీడనం ప్రభావం తమిళనాడు చెన్నై పైనే  ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆంధ్రాపై స్పల్పంగా ఎఫెక్ట్ చూపనుంది.  ఇక ఏపీ, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

ఈ రోజు,రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఈ రోజు, రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-

ఈ రోజు, రేపు :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం