AP Weather: బిగ్ అలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన.

|

Nov 09, 2022 | 3:20 PM

ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

AP Weather: బిగ్ అలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన.
Ap Weather Report
Follow us on

ఏపీకి హెవీ రెయిన్ అలర్ట్ వచ్చేసింది. నైరుతి బంగాళాఖాతం,  దానిని ఆనుకుని ఉన్న భూమధ్యరేఖ హిందూ మహా సముద్రముపై ఉన్న ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు (నవంబర్ 09) అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరిత ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో మరింత బలపడే అవకాశముంది . ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 09 నుండి 12వ తేదీల మధ్య తమిళనాడు -పుదుచ్చేరి తీర ప్రాంతలకు విస్తరించే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి ఇప్పుడు మధ్య బంగాళాఖాతం నుండి నైరుతి బంగాళాఖాతం & ఆనుకుని భూమధ్యరేఖ హిందూ మహా సముద్రముపై ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్నది.

అయితే ఈ ద్రోణి ప్రభావం ఎక్కువగా తమిళనాడుపై ఉండే అవకాశం ఉంది. చెన్నై , చెంగల్పట్టు, కాంచీపురం, తిరువాళ్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ ద్రోణి గురువారానికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఏపీలోని దక్షిణ కోస్తా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో కూడా వాన దంచికొడుతుందిన హెచ్చరించింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
————————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఈరోజు:- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .

రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :- 

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం