అసెంబ్లీలో తీర్మానం చేశాం… ఎన్నికలకు సమయం కావాలి… నిమ్మగడ్డకు ఇప్పుడు బాధ్యత గుర్తుకొచ్చిందా…

| Edited By:

Dec 06, 2020 | 6:06 PM

జనవరిలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు 2, 3 నెలల సమయం పడుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని అన్నారు.

అసెంబ్లీలో తీర్మానం చేశాం... ఎన్నికలకు సమయం కావాలి... నిమ్మగడ్డకు ఇప్పుడు బాధ్యత గుర్తుకొచ్చిందా...
Follow us on

జనవరిలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు 2, 3 నెలల సమయం పడుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధానే చెప్పారన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తీర్మానం చేశామని పేర్కొన్నారు.

చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు…

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు సలహాలు ఇచ్చే స్థాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు లేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఏం చెబితే నిమ్మగడ్డ అదే చేస్తున్నారన్నారు. ఇన్నాళ్లు లేని బాధ్యత నిమ్మగడ్డకు ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. కరోనా దృష్ట్యా ఎన్నికలు సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.