Watch Video: వామ్మో.. తిరుమల ఘాట్ రోడ్డులో గజరాజుల గుంపు.. టీటీడీ కీలక ఆదేశాలు..

| Edited By: Srikar T

Jun 29, 2024 | 5:42 PM

ఏనుగుల గుంపు దర్శనమిచ్చింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద రోడ్‎ను దాటిన 13 ఏనుగుల గుంపును టిటిడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించింది. ఏనుగుల గుంపులో రెండు గున్న ఏనుగులు కూడా ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది ఈ మేరకు అప్రమత్తమైంది.

Watch Video: వామ్మో.. తిరుమల ఘాట్ రోడ్డులో గజరాజుల గుంపు.. టీటీడీ కీలక ఆదేశాలు..
Tirumala Ghat Road
Follow us on

ఏనుగుల గుంపు దర్శనమిచ్చింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద రోడ్‎ను దాటిన 13 ఏనుగుల గుంపును టిటిడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించింది. ఏనుగుల గుంపులో రెండు గున్న ఏనుగులు కూడా ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది ఈ మేరకు అప్రమత్తమైంది. టిటిడి ఫారెస్ట్, పోలీసు యంత్రాంగం రిపీటర్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగుల మూమెంట్‎ను గమనించి అవ్వాచారి కోన వైపు దారి మళ్ళించారు. దాదాపు నిన్న రాత్రి 9:30 దాకా తిరుమల ఘాట్ రోడ్‎లో ముందస్తు జాగ్రత్తగా వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. మొదటి ఘాట్ రోడ్డుకు, తిరుమల నడక మార్గానికి దూరంగా ఆవ్వాచారి కోన వైపు ఏనుగుల గుంపును అటవీ శాఖ సిబ్బంది తరిమేసింది.

దాదాపు నెలకు ఒకసారి అన్నమయ్య మార్గం, మామండూరు ఫారెస్ట్ ఏరియా వైపు ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీ శాఖ గుర్తించింది. అయితే ఈ ఏనుగుల గుంపు వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెబుతోంది. దీంతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే భక్తులు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చింది. ట్రాఫిక్‎కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని టిటి ఫారెస్ట్ అధికారులు, పోలీసు సిబ్బంది తెలిపారు. ఇలా ఇద్దరి జాయింట్ యాక్షన్‎తో ఏనుగుల గుంపును శేషాచలం కొండల్లోని దట్టమైన అటవీ ప్రాంతం వైపు మళ్ళించామన్నారు. ఏనుగుల వల్ల భక్తులకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత వాహనాల రాకపోకలను, కాలినడక భక్తులను యధావిధిగా వెళ్లేందుకు అనుమతించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..