బ్రేకింగ్ :రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో మరో ట్విస్ట్..

| Edited By: Pardhasaradhi Peri

Jul 03, 2020 | 1:26 PM

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఢిల్లీకి చేరింది. తనకు షోకాజ్ నోటీసులకు  రిప్లై ఇచ్చిన ఎంపీ.. అధినేత జగన్‌కు లేఖతో హీట్ పెంచారు. అంతేకాదు ఢిల్లీ పర్యటనకు వెళ్లి లోక్‌సభ స్పీకర్.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలను కలిసిన విషయం తెలిసిందే.. దీంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ పరిణామాలను గమనించిన వైసీపీ అధిష్టానం రఘురామ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.శుక్రవారం (జులై 7 ) లోక్‌సభ స్పీకర్‌ […]

బ్రేకింగ్ :రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో మరో ట్విస్ట్..
Follow us on

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఢిల్లీకి చేరింది. తనకు షోకాజ్ నోటీసులకు  రిప్లై ఇచ్చిన ఎంపీ.. అధినేత జగన్‌కు లేఖతో హీట్ పెంచారు. అంతేకాదు ఢిల్లీ పర్యటనకు వెళ్లి లోక్‌సభ స్పీకర్.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలను కలిసిన విషయం తెలిసిందే.. దీంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ పరిణామాలను గమనించిన వైసీపీ అధిష్టానం రఘురామ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.శుక్రవారం (జులై 7 ) లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను వైసీపీ ఎంపీలు, న్యాయనిపుణులు కాసేపట్లో కలవనున్నారు. రఘురామకృష్ణంరాజుపై “అనర్హత” వేటు వేయాలని స్పీకర్‌ను ఎంపీలు కోరనున్నారు. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆధారాలను స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం తర్వాత  వైసీపీ ఎంపీలకు స్పీకర్‌ సమయం ఇచ్చారు. ఎంపీలు స్పీకర్‌ను కలుస్తుండటంతో ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కిందనే చెప్పాలి.