వైఎస్‌ వివేకా హత్య కేసు: ఇవాళ ఆ ఆరుగురిని ప్రశ్నించనున్న సీబీఐ

| Edited By:

Sep 21, 2020 | 2:13 PM

మాజీ మంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది.

వైఎస్‌ వివేకా హత్య కేసు: ఇవాళ ఆ ఆరుగురిని ప్రశ్నించనున్న సీబీఐ
Follow us on

YS Viveka murder case: మాజీ మంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ సీబీఐ అధికారులు ఆరుగురిని ప్రశ్నించనున్నారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిద్దరు కడపకు చెందిన వారు. ఇక పులివెందుల నుంచి వైఎస్ వివేకా కుటుంబానికి సన్నిహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు విచారణకు హాజరయ్యారు. వారిద్దరు బ్యాగ్‌లను తీసుకొని విచారణకు వచ్చారు. అలాగే కర్నూల్‌కి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు సీబీఐ విచారణకు వెళ్లారు. కాగా గతేడాది మార్చి 15న పులివెందులలోని తన స్వగృహంలో అనుమానాస్పద స్థితిలో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు. మొదట గుండెపోటుతో ఆయన మరణించారనుకున్నప్పటికీ.. ఆ తరువాత హత్యగా తేలింది. దీంతో ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.

Read more:

Nishabdham trailer: అంచనాలు పెంచేసిన ‘నిశ్శబ్దం’ ట్రైలర్

కరోనా కాలం.. ఏపీలో పెరిగిన గుడ్డు ధరలు