జగనన్న విద్యాకానుక ద్వారా 42.43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

| Edited By:

Oct 07, 2020 | 3:08 PM

జగనన్న విద్యాకానుక పథకాన్ని గురువారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో

జగనన్న విద్యాకానుక ద్వారా 42.43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
Follow us on

Jagananna Vidya Kanuka: జగనన్న విద్యాకానుక పథకాన్ని గురువారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యాకానుక పథకం గురించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ వేశారు.

జగనన్న విద్యా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 42.34 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకంలో భాగంగా కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలు, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్‌, బెల్ట్‌, నోట్‌బుక్‌లు, స్కూల్‌బ్యాగ్‌ ఇలా వివిధ రకాల వస్తువులని అందిస్తున్నాము. మొదటి తరగతి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారు’ అని ట్వీట్‌లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్క్‌లను కూడా ఇవ్వనున్నారు. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోన్న జగన్‌.. ఇప్పటికే జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, నాడు-నేడు.. ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

Read More:

రూ.1.1కోట్లు కట్టండి.. ఆ‌ ఛానెల్‌కి ‘నిశ్శబ్దం’ టీమ్‌ నోటీసులు

మళ్లీ ఆసుపత్రిలో చేరిన నటుడు విజయ్‌కాంత్