బ్రేకింగ్: ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్

| Edited By:

Feb 04, 2020 | 12:31 PM

తూర్పు గోదావరి జిల్లా ఉప్పూడిలో గత రెండు రోజులుగా లీక్ అవుతున్న గ్యాస్‌ అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ బృందం గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకొచ్చింది. అయితే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఉప్పూడి ప్రాంతంలో డ్రిల్లింగ్ సైట్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఓఎన్‌జీసీ అధికారులు అప్రమత్తమై.. గ్యాస్‌‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. భారీ శబ్దాలతో గ్యాస్ ఎగిసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో ఇళ్లను పోలీసులు […]

బ్రేకింగ్: ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్
Follow us on

తూర్పు గోదావరి జిల్లా ఉప్పూడిలో గత రెండు రోజులుగా లీక్ అవుతున్న గ్యాస్‌ అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ బృందం గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకొచ్చింది. అయితే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఉప్పూడి ప్రాంతంలో డ్రిల్లింగ్ సైట్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఓఎన్‌జీసీ అధికారులు అప్రమత్తమై.. గ్యాస్‌‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. భారీ శబ్దాలతో గ్యాస్ ఎగిసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో ఇళ్లను పోలీసులు ఖాళీ చేయించారు. ప్లాన్-1 విఫలమవడంతో ప్లాన్-2 అమలు చేశారు. ఓఎన్జీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ ఆదేశ్ కుమార్ ఆధ్వర్యంలో మడ్ పంపింగ్ ద్వారా ఎగిసిపడుతోన్న గ్యాస్‌ను తాజాగా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో సమీప ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఆ ప్రాంతంలో చమురు నిక్షేపాల కోసం 2006లో ఓ బావిని తవ్వారు. అయితే ఆ తరువాత చమురు నిక్షేపాలు లేవని ఓఎన్జీసీ గ్యాస్ వెలికితీతను నిలిపివేసింది. కానీ ఇటీవల పీఎఫ్‌హెచ్ కంపెనీకి గ్యాస్ వెలికితేసే పనిని అప్పగించారు. దీంతో కంపెనీ ప్రతినిధులు చమురు నిక్షేపాల కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం పీఎఫ్‌హెచ్ కంపెనీ చమురు నిక్షేపాలను వెలికితీసే ప్రక్రియ చేపట్టిన సమయంలో వాల్‌కు మర అడ్డొచ్చింది. ఆ తరువాత గట్టిగా తగలడంతో గ్యాస్ బయటకొచ్చింది.