హైదరాబాద్‌లో 137 లింక్ రోడ్ల నిర్మాణం: మంత్రి కేటీఆర్

|

Jul 29, 2020 | 2:40 PM

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సనత్‌నగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైల్వే అండర్‌‌ బ్రిడ్జి వల్ల ఫతేనగర్‌‌, సనత్‌నగర్‌‌ మెయిన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందని తెలిపారు.

హైదరాబాద్‌లో 137 లింక్ రోడ్ల నిర్మాణం: మంత్రి కేటీఆర్
Follow us on

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సనత్‌నగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, ప‌లువురు కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ,..రూ. 68 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జి, రూ. 45 కోట్లతో ఫతేనగర్ ఫ్లై ఓవర్ నాలుగు లైన్‌ల రోడ్డు విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. రైల్వే అండర్‌‌ బ్రిడ్జి వల్ల ఫతేనగర్‌‌, సనత్‌నగర్‌‌ మెయిన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందని తెలిపారు. ఏడాదిలోనే దీని నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల 6.5 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. బాలా నగర్ ఫ్లై ఓవర్ సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది అని చెప్పారు. హైదరాబాద్‌లో దశలవారీగా 137 లింక్ రోడ్ల నిర్మాణం చేపడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో మున్సిపల్ మంత్రి కె.టి.ఆర్ వంటి డైనమిక్ లీడర్ ను చూడలేదని ప్రశంసించారు. కరోనా టైమ్‌లో కూడా ఎక్కడ అభివృద్ది ఆగలేదని అన్నారు. సనత్ నగర్ ఫ్లైఓవర్‌‌ నిర్మాణం కూడా మంత్రి కేటీఆర్ చొరవే అని చెప్పారు. కరోనా మినహా తెలంగాణ ప్రజలంతా సంతోషంగా వున్నారని చెప్పారు.