ఐటీలో హైదరాబాద్‌ భేష్‌..కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

| Edited By: Pardhasaradhi Peri

Jul 15, 2020 | 4:44 PM

హైదరాబాద్‌ ఐటీ రంగంలో పురోగతి చాలా బాగుందని,.. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఐటీ వృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందన్నారు. ఉప్పల్‌లో నిర్వహించిన ఐటీ గ్రిడ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఐటీలో హైదరాబాద్‌ భేష్‌..కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ
Follow us on

హైదరాబాద్‌ ఐటీ రంగంలో పురోగతి చాలా బాగుందని,.. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఐటీ వృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందన్నారు. ఉప్పల్‌లో నిర్వహించిన ఐటీ గ్రిడ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నగరం నలువైపులా అభివృద్ధిని విస్తరించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు.

హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పర్శన్ (గ్రిడ్) లో భాగంగా ఐటీ కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సమావేశమయ్యారు. ఐటి అనుబంధ కంపెనీలను హైదరాబాద్ నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలతో పాటు భవిష్యత్తులో రానున్న ఐటీ కంపెనీల ఏర్పాటు వాటికి సంబంధించిన మార్గదర్శకాలపై ఈ భేటీలో చర్చించారు.

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐటిని నగరంలోని నలుమూలలకు విస్తరించే గ్రిడ్ పాలసీతో ముందుకు రానున్నది. ఐటీ పరిశ్రమలు ఈస్ట్ హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం అవసరమైన రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన పైన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ను రాయగిరి వరకు పొడిగించే ఆలోచన ఉందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.