మున్సిపల్ చట్టానికి పదును.. అవినీతి రహిత పాలనే ధ్యేయం

| Edited By:

Jul 22, 2019 | 12:09 PM

రాష్ట్రంలో కొత్తమున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. పాతచట్టాన్ని సవరించి.. మరికొన్ని అంశాలను చేరుస్తూ.. రాష్ట్రప్రభుత్వం ఈ కొత్తచట్టాన్ని తీసుకొచ్చింది. మూడ్రోజుల క్రితం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ చట్టసవరణ బిల్లుకు గవర్నర్‌సైతం ఆమోద ముద్రవేయడంతో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త మున్సిపల్ చట్టంలోని ముఖ్యాంశాలు.. – తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత – అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం. – ప్రజలకు […]

మున్సిపల్ చట్టానికి పదును.. అవినీతి రహిత పాలనే ధ్యేయం
Follow us on

రాష్ట్రంలో కొత్తమున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. పాతచట్టాన్ని సవరించి.. మరికొన్ని అంశాలను చేరుస్తూ.. రాష్ట్రప్రభుత్వం ఈ కొత్తచట్టాన్ని తీసుకొచ్చింది. మూడ్రోజుల క్రితం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ చట్టసవరణ బిల్లుకు గవర్నర్‌సైతం ఆమోద ముద్రవేయడంతో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.

కొత్త మున్సిపల్ చట్టంలోని ముఖ్యాంశాలు..

– తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత
– అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం.
– ప్రజలకు మేలు చేసేలా కొత్త చట్టం రూపకల్పన.
– 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1 మాత్రమే
– 75 గజాల లోపు నిర్మించుకున్న ఇంటికి టాక్స్ రూ. 100
– కార్యాలయానికి రాకుండానే 500 చదరపు మీటర్ల వరకు నిర్మాణాలకు అనుమతి
– 500 చదరపు మీటర్ల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి
– యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి
– ఇంటి కొలతలు, ఇతర తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలు
– తప్పుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే 25 రెట్ల జరిమానా.
– అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత
– పట్టణాలు, పల్లెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీ
– కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ ఏర్పాటు
– హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చేసే అధికారులు ఉద్యోగాల నుంచి తొలగింపు
– బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు
– మొక్కలు నాటి సంరక్షించని సర్పంచ్, చైర్‌పర్సన్‌ల పదవులు తొలగింపు
– కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం
– కొత్త చట్టంలో మరింత కీలకంగా జిల్లా కలెక్టర్ల పాత్ర