తెలంగాణలో పదోతరగతి పరీక్షలపై విచారణ మళ్లీ వాయిదా..!

| Edited By:

Jun 05, 2020 | 7:22 PM

తెలంగాణలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విచారణ మళ్లీ రేపటికి వాయిదా పడింది. విచారణలో భాగంగా కంటైన్మెంట్ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం..

తెలంగాణలో పదోతరగతి పరీక్షలపై విచారణ మళ్లీ వాయిదా..!
Follow us on

తెలంగాణలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విచారణ మళ్లీ రేపటికి వాయిదా పడింది. విచారణలో భాగంగా కంటైన్మెంట్ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం.. సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని అడిగింది. దానికి స్పందించిన ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఇప్పుడు పరీక్షలు రాసిన విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని అన్నారు. దీని గురించి ప్రభుత్వాన్ని సంప్రదించి శనివారం తమ నిర్ణయం చెబుతామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలోని మొత్తం కంటైన్మెంట్ జోన్లు, సంప్లిమెంటరీపై పూర్తి వివరాలను తెలియజేయాలని హైకోర్టు, ప్రభుత్వానికి సూచించింది.

కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించొచ్చంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయగా.. ఈ నెల 8 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: 3 నిమిషాలే టైమ్.. తండ్రికి కరోనా అనుమానితురాలి వీడ్కోలు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ఘటన