రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

| Edited By:

Sep 11, 2019 | 1:31 AM

కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ.. పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై.. ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. సోమవారం రోజు రాజగోపాల్.. టీపీసీసీ చీఫ్.. ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరితోనే తెలంగాణలో కాంగ్రెస్ గల్లంతవుతుందన్నారు. అయితే రాజగోపాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఫయీమ్‌ మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డికి ధైర్యం ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా […]

రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
Follow us on

కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ.. పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై.. ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. సోమవారం రోజు రాజగోపాల్.. టీపీసీసీ చీఫ్.. ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరితోనే తెలంగాణలో కాంగ్రెస్ గల్లంతవుతుందన్నారు. అయితే రాజగోపాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఫయీమ్‌ మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డికి ధైర్యం ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ ఎమ్మెల్యేగా మునుగోడు నుంచి గెలవాలని సవాల్ విసిరారు. ఉత్తమ్‌, కుంతియాలపై రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి సూచించారు. అయితే ఉత్తమ్‌, కుంతియా వారి పదవుల నుంచి వైదొలిగితేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడుతుందంటూ రాజగోపాల్‌రెడ్డి సోమవారం వ్యాఖ్యానించారు.