పృథ్వీపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలి..!

| Edited By: Pardhasaradhi Peri

Jan 13, 2020 | 2:22 PM

మహిళా ఉద్యోగినితో ప‌ృథ్వీ అసభ్యకర సంభాషణకు సంబంధించిన ఆరోపణలపై వివాదం కొనసాగుతోంది. ప‌థ్వీపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో వీరు ధర్నా చేస్తున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పిస్తే సరిపోదని.. దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లైంగిక వేధింపులతో పాటు ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపైనా పృథ్వీపై విచారణ […]

పృథ్వీపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలి..!
Follow us on

మహిళా ఉద్యోగినితో ప‌ృథ్వీ అసభ్యకర సంభాషణకు సంబంధించిన ఆరోపణలపై వివాదం కొనసాగుతోంది. ప‌థ్వీపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో వీరు ధర్నా చేస్తున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పిస్తే సరిపోదని.. దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లైంగిక వేధింపులతో పాటు ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపైనా పృథ్వీపై విచారణ జరిపించాలని వారు అంటున్నారు. అలాగే టీటీడీకి భ్రష్టు పట్టించిన పృథ్వీపై టీటీడీ పరువు నష్టం దావా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే మహిళా ఉద్యోగినితో పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడినట్లు ఉన్న ఆడియో టేపులు వైరల్‌గా మారాయి. దీంతో మనస్తాపం చెందిన పృథ్వీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. తనపై విచారణ ముగిసిన తరువాత మళ్లీ ఆ సీట్లో కూర్చుంటానంటూ చెప్పుకొచ్చారు. తన వాయిస్‌ను మార్ఫింగ్ చేసి ఆడియోలో పెట్టారంటూ పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ కోసం నిజ నిర్ధారణ కమిటీని నియమించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.