నా కూతురికి న్యాయం చేయలేనప్పుడు.. దిశ చట్టం ఎందుకు..!

| Edited By:

Feb 12, 2020 | 5:25 PM

తన కుమార్తెకు న్యాయం చేయలేనప్పుడు దిశ చట్టం ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి. 2015 నుంచి తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ తాను పోరాటం చేస్తూ వస్తున్నానని గుర్తుచేసిన పార్వతీ దేవి.. ఈ కేసులో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకొని.. తమకు న్యాయం చేయడం కోసం ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఈ సందర్భంగా ఆమె కృతఙ్ఞతలు తెలియజేశారు. 2015లో ఓ […]

నా కూతురికి న్యాయం చేయలేనప్పుడు.. దిశ చట్టం ఎందుకు..!
Follow us on

తన కుమార్తెకు న్యాయం చేయలేనప్పుడు దిశ చట్టం ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి. 2015 నుంచి తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ తాను పోరాటం చేస్తూ వస్తున్నానని గుర్తుచేసిన పార్వతీ దేవి.. ఈ కేసులో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకొని.. తమకు న్యాయం చేయడం కోసం ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఈ సందర్భంగా ఆమె కృతఙ్ఞతలు తెలియజేశారు.

2015లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో తన కుమార్తె దారుణ హత్యాచారానికి గురైందని.. అప్పటి నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులకు తమ సమస్యను విన్నవించుకున్నామని పార్వతీ దేవి చెప్పారు. ఈ కేసుపై పోరాడుతున్న తమను ఒకానొక సమయంలో పోలీస్ స్టేషన్‌లో కూడా పెట్టించారని తన బాధను వ్యక్తపరిచారు. ఇక తన బాధను పవన్‌ కల్యాణ్‌‌కు విన్నవిస్తే.. ఆయన ముందుకు వచ్చారని ఆమె అన్నారు. అన్న(పవన్)ను కలిసిన తరువాత చాలామంది తమకు ఫోన్ చేసి పవన్‌‌ను కలిస్తే న్యాయం జరగదంటూ తమకు చెప్పారని పార్వతీ దేవి చెప్పుకొచ్చారు.

ఈ కేసులో కర్నూల్ ఇంఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను రెండు సార్లు కలిశానని.. మొదటిసారి బాగానే మాట్లాడినప్పటికీ, రెండోసారి యు చీప్ ప్యూపుల్ అంటూ అన్నారని పార్వతీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈ సంఘటన తమ హయాంలో జరిగింది కాదని., జగన్ మోహన్ రెడ్డి నిందితులను కాపాడలేదని టీవీల్లో చెప్పారని అన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం ఇద్దరూ.. తమ కుమార్తెకు న్యాయం చేయలేకపోయారని పార్వతీ దేవి అన్నారు. పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటనకు చలించి దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఇప్పటి ప్రభుత్వం.. తమ కుమార్తెకు ఎందుకు న్యాయం చేయడం లేదని., తన కుమార్తెది మానం, ప్రాణం కాదా..? అంటూ ఆమె ప్రశ్నించారు. బాగా చదువుకొని తనకు మంచి పేరు తీసుకొస్తుందని తమ కుమార్తెపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని.. కానీ ఇప్పుడు పోస్టర్లు, టీవీల్లో తమ కుమార్తె ఫొటో వస్తుంటే చూసి మనసు తట్టుకోవడం లేదని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.