శ్రీరామనవమి వేడుకలు.. దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం..!

| Edited By:

Mar 30, 2020 | 6:48 PM

ఈ ఏడాది ఏప్రిల్ 2 భద్రాద్రిలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని,

శ్రీరామనవమి వేడుకలు.. దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం..!
Follow us on

ఈ ఏడాది ఏప్రిల్ 2 భద్రాద్రిలో జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని, కళ్యాణోత్సవ వేడుకలకు భక్తులకు అనుమతి లేదని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏప్రిల్ 2న స్వామివారి ఆల‌యంలోనే శ్రీరామన‌వ‌మి వేడుకలను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వ‌హించనున్నామని.. కరోనా దృష్ట్యా భక్తులు ఎవరూ సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు అందులో పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ పరిస్థితిని భక్తులు అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని వారు కోరారు. అలాగే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ వేడుకలు నిర్వహించ వద్దని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read This Story Also: ‘ఆర్ఆర్ఆర్’లో మూడు పాత్రల్లో చెర్రీ..!