Vizag: విశాఖ జాలర్లకు చిక్కిన విచిత్ర చేప.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?

|

Mar 23, 2022 | 11:30 AM

సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు వివిధ రకాల చేపల చిక్కుతూ ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద.. పెద్ద చేపలు చిక్కితే వారు సంబరపడిపోతూ ఉంటారు.

Vizag: విశాఖ జాలర్లకు చిక్కిన విచిత్ర చేప.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?
Mulla Kappa Fish
Follow us on

Andhra Pradesh:  సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు వివిధ రకాల చేపల చిక్కుతూ ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద.. పెద్ద చేపలు చిక్కితే వారు సంబరపడిపోతూ ఉంటారు. ఒక్కోసారి వింత.. వింత చేపలు, రకరకాల రూపాల్లో ఉండేవి మత్స్యకారుల వలల్లో చిక్కుతుంటాయి. తాజాగా విశాఖ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. విశాఖ రుషికొండ(rushikonda) సమీప కార్తికవనం వద్ద సముద్రంలో మంగళవారం ఈ అరుదైన చేప వలలో పడింది. తల భాగంలో ముళ్లతో.. కాస్త భయానకంగా కనిపిస్తున్న దీన్ని ముళ్ల కప్ప అంటారని స్థానిక మత్స్యకారులు తెలిపారు. నీటిలో ఉండే.. చిన్న, చిన్న కీటకాలు… చేపలు, నాచు తింటూ జీవనం సాగించే ఈ కప్పలు.. ప్రమాద సమయాల్లో రక్షణ కోసం తల భాగంలోని ముళ్లతో ప్రతిఘటిస్తాయని  విశాఖ మత్స్య శాఖ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. దీని వ్యవహారిక నామం పఫర్‌ ఫిష్‌(Puffer Fish) అని వెల్లడించారు. కాగా ఈ జాతి చేపలు 2 కిలోల వరకు బరువు పెరుగుతాయట. అరుదుగా కనిపించే ఈ చేపను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు.

Also Read: Telangana: అర్ధరాత్రి అక్క ముఖంపై సలాసలా కాగే వేడి నూనె పోసిన చెల్లి.. షాకింగ్ రీజన్

వల బలంగా అనిపిస్తే ఈ రోజు పండగే అనుకున్నారు.. తీరా బయటకు తీశాక అవాక్కు..