Rain Alert: ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు

| Edited By:

Jul 06, 2020 | 9:10 AM

ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల వెంబడి కొనసాగుతుండగా.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 7, 8 తేదీల్లో […]

Rain Alert: ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు
Follow us on

ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల వెంబడి కొనసాగుతుండగా.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 7, 8 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో సముద్రం అల్లకల్లోలంగా మారగా.. తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిశాయి. చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరంలో 6 సెం.మీ, పార్వతీపురం, నర్సీపట్నంలో 5 సెం.మీ, సీతానగరం, చింతలపూడి, పోలవరం, తిరువూరులో 4 సెం.మీల వర్షపాతం నమోదైంది.