నిబంధనల ఉల్లంఘన.. ఏలూరులో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్‌

| Edited By:

Aug 23, 2020 | 7:57 AM

వరుస పరిణామాల నేపథ్యంలో కరోనా చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కోవిడ్‌ 19 నిబంధనలను పాటించని

నిబంధనల ఉల్లంఘన.. ఏలూరులో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్‌
Follow us on

Eluru Private hospital: వరుస పరిణామాల నేపథ్యంలో కరోనా చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కోవిడ్‌ 19 నిబంధనలను పాటించని ఆసుపత్రులపై వేటు వేస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేశారు.

అందులో ఎలాంటి అనుమతులు లేకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన జిల్లా వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు చేసి.. సీజ్ చేశారు. అందులో ఉన్న రోగులను మరో కోవిడ్‌ ఆసుపత్రికి తరలించారు.

Read More:

ఆ ఇద్దరు హీరోల సినిమాలు అయితే నటిస్తా: రోజా

RRR: సారీ చెప్పిన అలియా.. రేస్‌లో మరో నటి!