భవానీ కథ సుఖాంతం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

| Edited By: Srinu

Dec 09, 2019 | 3:09 PM

పలు ట్విస్ట్‌ల మధ్య భవానీ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు భవానీ కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదని వెల్లడించారు. కన్న తల్లిదండ్రుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. భవానీ విషయంలో ఇరు కుటుంబాలు తమ అనుమానాలకు తమ దృష్టికి తీసుకొచ్చారని.. వారి అనుమానాలను నివృత్తి చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవాని కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించిందని వారు తెలిపారు. […]

భవానీ కథ సుఖాంతం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
Follow us on

పలు ట్విస్ట్‌ల మధ్య భవానీ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు భవానీ కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదని వెల్లడించారు. కన్న తల్లిదండ్రుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. భవానీ విషయంలో ఇరు కుటుంబాలు తమ అనుమానాలకు తమ దృష్టికి తీసుకొచ్చారని.. వారి అనుమానాలను నివృత్తి చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవాని కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించిందని వారు తెలిపారు. దీనిపై ఇరు వర్గాలు ఒప్పుకున్నారని.. పెంపుడు తల్లిదండ్రుల దగ్గర కూడా కొన్ని రోజులు ఉంటానని భవానీ ఒప్పుకుందని స్పష్టం చేశారు. పెంచిన తల్లిదండ్రులు బాగా చూసుకున్నారని.. భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయొచ్చని భవానీకి సూచించినట్లు పోలీసులు తెలిపారు.

భవానీ వెళ్తున్నందుకు బాధగా ఉంది: పెంచిన తల్లి
తమకు ఉన్నంతలో భవానీని బాగా చూసుకున్నామని.. కానీ ఇప్పుడు ఆమె కన్న తల్లి దగ్గరకు వెళ్తానంటుంటే చాలా బాధగా ఉందని ఆమెను పెంచిన తల్లి జయమ్మ చెప్పుకొచ్చింది. అయినా పది రోజులకు ఒకసారి తమ దగ్గరకు వస్తామని భవానీ చెప్పిందని ఆమె తెలిపింది. పాప రక్షణ కోసమే డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని కోరామని జయమ్మ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. మరోవైపు భవానీని బాగా చూసుకోవాలని కోరుతున్నామని పెంచిన తండ్రి జీవరత్నం భావోద్వేగానికి గురయ్యారు.

ఇద్దరు తల్లులు ముఖ్యమే
తనకు ఇద్దరు తల్లులు ముఖ్యమేనని భవానీ తెలిపింది. ప్రస్తుతానికి కన్నతల్లి దగ్గరకు వెళ్తున్నానని.. పది రోజులు తరువాత పెంచిన తల్లి దగ్గరకు వెళ్తానని ఆమె చెప్పుకొచ్చింది. మరోవైపు పాప కనిపించడం సంతోషంగా ఉందని, భవానీని ఇన్ని రోజులు కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రులకు రుణపడి ఉన్నామని.. ఆమె కన్న తల్లిదండ్రులు వెళ్లడించారు.

అయితే 12 ఏళ్ల క్రితం తన సోదరుడితో కలిసి స్కూల్‌కు వెళ్లిన భవానీ కనిపించకుండా పోయింది. ఆమె కోసం తల్లి దండ్రులు ఎంతగానో వెతికారు. మరోవైపు తప్పిపోయిన భవానీ జయమ్మ అనే మహిళకు కనిపించగా.. తన ఇంటికి తీసుకెళ్లి అప్పటి నుంచి తానే పెంచుకుంది. ఇంటర్ వరకు భవానీని చదివించింది. అయితే ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేరిన భవానీ.. ఆ ఇంటి యజయాని మోహన్ వంశీ సహాయంతో ఎట్టకేలకు కన్నవారిని కలుసుకోగలిగింది.